ఆంధ్ర‌ప్ర‌దేశ్‌తిరుమల

శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం ధరలో ఎటువంటి మార్పు లేదు

శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం ధరలో ఎటువంటి మార్పు లేదు

-టీటీడి

తిరుమల, శోధన న్యూస్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి వా రి ప్రత్యేక ప్రవేశ దర్శనం , లడ్డూ ధరల్లో ఎటువంటి మార్పు లేదని, టీటీడీ ధరలను సవరించిందని పలు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ప్రచారాలు, ప్రకటనలు  అవాస్తవం అని టీటీడీ భక్తులకు తెలిపింది. తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 ,లడ్డూ ప్రసాదం రూ. 50  చొప్పున విక్రయిస్తున్నట్లు టీటీడీ స్పష్టం చేసింది.  ప్రత్యేక ప్రవేశ దర్శనం కొరకు దళారులను సంప్రదించొద్దని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేసింది.   కొన్ని వాట్సాప్  గ్రూపులలో తిరుమల దర్శనానికి సంబంధించి అధిక ధరలకు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు పొంద వచ్చునని కొంతమంది వారి ఫోన్ నంబర్లతో కూడిన సమాచారం చక్కర్లు కొడుతోందని తెలిపింది. వాస్తవానికి శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించి టీటీడీ వెబ్సైట్ ద్వారానే కాకుండా వివిధ రాష్ట్రాలకు సంబంధించిన టూరిజం విభాగాలకు కొంత టికెట్ల కేటాయింపు జరిగిందని, భక్తులు ఎవరైనా సంబంధిత టూరిజం ద్వారా ఈ టిక్కెట్లను పొందే సౌకర్యం ఉందని తెలిపింది. టూరిజం ద్వారా రావాలి అనుకొనే భక్తులు, దళారీ ల ద్వారా కాకుండా, నేరు గా, రాష్ట్ర టూరిజం వెబ్సైట్ ద్వారా కూడా దర్శనం ప్యాకేజీ టికెట్స్ పొందే అవకాశం ఉందని పేర్కొంది. అయితే కొందరు దళారులు అమాయకులను తాము సదరు టూరిజం వెబ్సైట్ ద్వారా మీకు టిక్కెట్లు బుక్ చేసి ఇస్తామని, ఇందుకుగాను ధర ఎక్కువ అవుతుందని పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నట్టు మా దృష్టికి వచ్చిందని టీటీడీ తెలిపింది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్ లో అమాయకులైన భక్తులను మోసగిస్తున్న దళారులపై టిటిడి విజిలెన్స్ విభాగము కఠిన చర్యలు తీసుకుంటుందని తెలియజేసింది.  అంతేకాకుండా ఇటువంటి దళారుల మాటి నమ్మి మోసపోవద్దని భక్తులకు విజ్ఞప్తి చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *