మేదరమెట్ల నాగేశ్వరరావు ను సన్మానించిన తెలుగుదేశం శ్రేణులు
మేదరమెట్ల నాగేశ్వరరావు ను సన్మానించిన తెలుగుదేశం శ్రేణులు
మణుగూరు, శోధన న్యూస్ : పాదయాత్ర ముగించుకొని మణుగూరు వచ్చిన సందర్భంగా భదాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం పినపాక నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టిఎన్ టియుసి రాష్ట్ర కార్యదర్శి మెదరమెట్ల నాగేశ్వరావుని పార్టీ నాయకులు ఘనంగా సన్మానించి సత్కరించారు..ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. నా పాదయాత్ర కు సహకరించిన తెలంగాణ తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు,ఆంధ్రాలో సహకరించిన తిరువూరు ఎంఎల్ఏ కొలతపూడి శ్రీనివాసరావు కి,మైలవరం ఎంఎల్ఏ వసంత కృష్ణప్రసాద్కి ,మాజీ మంత్రి దేవినేని ఉమకి ,ఎంపీ కేశినేని చిన్నికి,నాకు దగ్గరుండి సహకరించిన తిరువూరు తెలుగుదేశం పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకుడు, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు కిల్లారి శివరామ కృష్ణా కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధికార ప్రతినిధి మెదరమెట్ల శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ మహబూబాబాద్ పార్లమెంట్ కార్యదర్శి సంఘీ సుబ్బారెడ్డి, తెలుగుదేశ పార్టీ సీనియర్ నాయకులు పసునూరి కృష్ణ, లక్ష్మీపురం గ్రామ ప్రెసిడెంట్ గంగిరెడ్డి, మహిళా నాయకులు మడి శాంతి, విజయలక్ష్మి, అనసూర్య, సరిత తదితరులు పాల్గొన్నారు.