BadradrikothagudemTelangana

అమ్మ ఆదర్శ పాఠశాల పథకం అమలుపై సమీక్ష

అమ్మ ఆదర్శ పాఠశాల పథకం అమలుపై సమీక్ష

జిల్లాలోని అమ్మ ఆదర్శ పాఠశాలల్లో మరమ్మతు పనులు పూర్తి చేయాలని కలెక్టర్‌ జితేష్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు.అమ్మ ఆదర్శ పాఠశాలలో , పనులు చేయించే విధానంపై శుక్రవారం నాడు ఐ డి ఓ సి కార్యాలయం సమావేశమందిరం లో డి ఆర్ డి ఓ విద్యచందన తో కలిసి నీటిపారుదల, పంచాయతీరాజ్‌, అర్‌అండ్‌బీ, మున్సిపల్‌, పీఎస్‌ఈడబ్ల్యూఐడీసీ, ఈఈలతో వీడియోకాన్ఫిరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో 697 పాఠశాలల్లో పనులు చేసే విధానంపై ఇంజనీర్లకు పలు సూచనలు చేశారు.పాఠశాలలో తాగునీరు, మిషన్ భగీరథ నీటిని అందించకుండా పాఠశాల ఆవరణలో గాని,తరగతిలో గాని స్టీల్ ట్యాంక్ ఏర్పాటుచేసి దానికి సెడ్మెంట్ ఫిల్టర్ బిగించవలసిందిగాఆదేశించారు. దీనివల్ల విద్యార్థిని విద్యార్థులకు స్వచ్ఛమైన నీరు అంది వర్షాకాలంలో వచ్చే ఎటువంటి వ్యాధులనైనా నివారించవచ్చని తెలిపారు.

పిల్లలు భోజన సమయంలో చేతులు కడుక్కోవడానికి, భోజన అనంతరం ప్లేట్స్ కడగడానికి స్టీల్ వాష్ బేసిన్ ఏర్పాటు చేయాలని, వాడిన నీరు ఇంక డానికి ఇంకుడు గుంత ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఎలక్ట్రికల్ పనులకు సంబంధించి వైరింగ్, ట్యూబ్ లైట్లు, ఫ్యాన్లు బిగించవలసిందిగా, వైరింగ్ మొత్తము కన్సిల్డ్ పద్ధతిలో చేయించవలసిందిగా కోరారు.

టాయిలెట్లు విషయం గదిలోపల టైల్స్ వాడరాదని కాంక్రీట్ ఫ్లోరింగ్ చేయించి రెడ్ క్సైడ్ తో పెయింట్ వేయాలని దీనివల్ల ఖర్చు తక్కువ అవుతుందని పిల్లలు జారిపడే అవకాశం కూడా ఉండదని తెలిపారు . ఒకవేళ టాయిలెట్ పైకప్పు కారుతూ ఉంటే దానిని తొలగించి జి ఐ షీట్ బిగించవలసిందిగా జిఐ షీట్ పైన కెమికల్ ట్రీట్మెంట్ తో వర్షపు నీరు కాకుండా నివారించవచ్చని తెలిపారు.

పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి పాఠశాలలో మునగ,చింత,కరివేపాకు, ఉసిరి,వెలక్కాయ వంటి ఎత్తైన చెట్లు నాటాలన్నారు. పిల్లల ఆహ్లాదం కొరకు మల్లె,మందార, కనకాంబరం నందివర్ధనం, గులాబీ మొక్కలను పెంచాలన్నారు.
ఆరోగ్య రీత్యా తులసి, ఇన్సులిన్ ప్లాంట్, రణపాల, నేల ఉసిరి, తిప్పతీగ మొక్కలను ఏర్పాటు చేయాలన్నారు. ఈ మొక్కల ఏర్పాటులో పాఠశాల ఉపాధ్యాయులు అందరూ పాల్గొనాలని దానివల్ల విద్యార్థులకు ఒక మంచి సందేశం అందుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పంచాయతీరాజ్ ఈ ఈ శ్రీనివాస్, ఆర్ అండ్ బి ఈ ఈ వెంకటేశ్వర్లు, విద్య శాఖ అధికారి వెంకటేశ్వరచారి, ఆర్ అండ్ బి డి ఈ నాగేశ్వరరావు, మున్సిపల్ డి ఈ రవికుమార్, ట్రైబల్ వెల్ఫేర్ డి ఈ, మెప్మా పి డి రాజేష్, డి పి ఎం సిర్ప్ నాగజ్యోతి, రంగారావు, అన్ని మండలాల ఎంపీడీఓ లు, ఎం ఈ ఓ లు,డీఈలు, ఏ ఈ లు, ఏ పి ఎం లు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *