కోతకు గురవుతున్న పెద్దవాగు బ్రిడ్జిని పరిశీలించిన జిల్లా కలెక్టర్..
కోతకు గురవుతున్న పెద్దవాగు బ్రిడ్జిని పరిశీలించిన జిల్లా కలెక్టర్..
-కోతకు గురికాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలి..
-సమస్యలను వివరించిన తాసిల్దార్ నాగప్రసాద్..
కరకగూడెం, శోధన న్యూస్: పెద్దవాగు బ్రిడ్జి కోతకు గురవుతున్న ప్రాంతాన్ని ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలి అని జిల్లా కలెక్టర్ జితేష్ వి పటేల్ అన్నారు. కరకగూడెం మండల పరిధిలోని చిరుమళ్ళ మధ్య పెద్ద వాగు మీద నిర్మించిన బ్రిడ్జి గత సంవత్సరం జులై నెలలో భారీ వర్షాలకు తెగిపోవడంతో ఎనిమిది గ్రామాల ప్రజలు అనేక ఇబ్బందులు పడడంతో ప్రత్యామ్నాయ ఏర్పాటుగా గ్రావెల్ పోసి మరమ్మత్తులు చేపట్టారు. వర్షాకాలం రావడంతో కొత్తగా జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన జితిష్ వి పటేల్ ఆదివారం కోతకు గురవుతున్న పెద్దవాగు బ్రిడ్జి ప్రాంతాలను పరిశీలించారు. స్థానిక అధికారులను పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. వర్షాకాలం రావడంతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పూర్తిస్థాయిలో పనులు చేపట్టలేము కాబట్టి తాత్కాలికంగా గ్రావెల్ క్రుంగి కొట్టకపోకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని. వాగు మధ్యలో ఉన్న ఇసుక మైనింగ్ డిపార్ట్మెంట్ కు చెప్పి వాటిని తరలించే విధంగా ఏర్పాటు చేస్తానని ఆయన అన్నారు. కలెక్టర్ వద్ద ఎనిమిది గ్రామాల ప్రజలు తమ పడుతున్న బాధలను చెప్పుకున్నారు. ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తానని వారికి తెలిపారు. మండలంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలైన బస్టాండ్ పబ్లిక్ టాయిలెట్ నిర్మాణం త్వరితగతిన చేపడితే ప్రజలకు ఎంతోగానో ఉపయోగపడుతుంది. అని తాసిల్దార్ నాగప్రసాద్ కలెక్టర్ కు విన్నవించగా త్వరలోనే స్వేచ్ఛ భారత్ ద్వారా పబ్లిక్ టాయిలెట్లు ఏర్పాటు చేస్తామని త్వరలోనే అన్ని స్కూళ్లలో ప్రభుత్వ కార్యాలయాల్లో టాయిలెట్లు ఏర్పాటు చేస్తానని అన్నారు. వెంకటాపురం ,బర్లగూడెం రహదారులు దెబ్బతిన్నాయని వివరించగా వాటికి ఇసుకతో కట్టలు కట్టాలని తాత్కాలికంగా వర్షాకాలం వెళ్లిన తర్వాత శ్వాసత పరిష్కారం చూపుదామని ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అధికారులు అప్రమత్తతతో అన్ని శాఖల సమన్వయంతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా రహదారులు ఏర్పాటు చేయాలని ముంపు ప్రాంతాలను గుర్తించాలని అన్నారు. పెద్దవాగును పరిశీలించిన వారిలో ఏడుల్లా బయ్యారం సిఐ కరుణాకర్, తాసిల్దార్ నాగప్రసాద్, ఎంపీడీవో రామకృష్ణ, పంచాయతీ కార్యదర్శులు, వివిధ పార్టీల నాయకులు ప్రజాప్రతినిధులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.