పెన్షన్ డబ్బులు కోసం అవ్వ తాతలు ఎదురుచూపులు
పెన్షన్ డబ్బులు కోసం అవ్వ తాతలు ఎదురుచూపులు
-నెల చివరికి వస్తున్న ఇంతవరకు పడని జూన్ నెల పెన్షన్
కరకగూడెం,శోధన న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలో పెన్షన్ డబ్బుల కోసం అవ్వ తాతలు ఎదురుచూపులు తప్పడం లేదు. పెన్షన్ డబ్బులు ఎప్పుడు బ్యాంకులో పడతాయని బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. వీరికి నెలలో నిర్ణీత గడువు సమయంలో రాకపోవడంతో వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు వ్యక్తిగత అవసరాలతో పాటు మందులు ఇతర అవసరాలకు కొనుక్కోవడానికి చేతిలో చిల్లి గవ్వ లేకపోవడంతో నానా అవస్థలు పడుతున్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి పెన్షన్ వేయవలసిందిగా పెన్షన్ దారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.