సీజనల్ వ్యాధులు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
సీజనల్ వ్యాధులు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
కరకగూడెం,శోధన న్యూస్: సీజనల్ వ్యాధులు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం ఎంపీపీ రేగా కాళిక అన్నారు.బుధవారం కరకగూడెం మండల ఎంపీడీఓ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని ఈ సందర్భంగా మాట్లాడుతూ…ప్రస్తుత వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని తెలిపారు. ఇందుకుగాను కాచి వడగాచిన నీళ్లు సేవించాలని సూచించారు. వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత పాటించాలని అన్నారు.వర్షాకాలంలో వాతావరణంలో చోటుచేసుకునే మార్పుల ఫలితంగా సీజనల్ వ్యాధులైన మలేరియా,డెంగ్యూ,టైఫాయిడ్, చికెన్ గున్యా వంటి వ్యాధులతో పాటు విషజ్వరాలు ప్రభలే అవకాశం అధికంగా ఉంటుందని ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు కాచి వడగాచిన నీటిని తీసుకోవడం మంచిదని సూచించారు. అధికారులకు తగిన సూచనలు ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలోDr. మధు, ఎంపీడీఓ దేవ వర కుమార్,జె ఈ,ఏపీవో,పంచాయతీ కార్యదర్శులు,అంగన్వాడీ టీచర్స్, ఆశ వర్కర్లు,మరియు పీల్డ్ అసిస్టెంట్ లు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.