అశ్వాపురంతెలంగాణపినపాక నియోజకవర్గంభద్రాద్రి కొత్తగూడెం

పీహెచ్ సీ ని సందర్శించిన డిఎంహెచ్ఓ 

పీహెచ్ సీ ని సందర్శించిన డిఎంహెచ్ఓ 

కరకగూడెం,శోధన న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా  అశ్వాపురం మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం జిల్లా వైద్యాధికారి భాస్కర్ నాయక్ సందర్శించారు.ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఓపీ ల్యాబ్‌,మెడిషన్‌ స్టాక్‌ రిజిస్టర్లను, ఆసుపత్రిలో నోటీసు బోర్డుల ఏర్పాటు, అవగాహన బోర్డులు, రోగుల వార్డులు,ప్రసవాల గదితో పాటు ఆసుపత్రి లోపల,బయట పరిశుభ్రత నిర్వహణ తీరు పరిశీలించడంతో పాటు ప్రసవాల నిర్వహణ,గర్భిణులకు అందిస్తున్న వైద్య సేవలు గురించి మండల వైద్యాధికారి డాక్టర్ సంకీర్తనను అడిగి తెలుసుకున్నారు.అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ పారామెడికల్ ఆఫీసర్ శ్రీనివాస్ రావు,డాక్టర్ దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *