Uncategorized

భద్రాద్రి జిల్లా లో  రేపు డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క పర్యటన

భద్రాద్రి జిల్లా లో  రేపు డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క పర్యటన

-మంత్రులతో కలిసి అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపన

-గోదావరి వరదలపై కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష

-మాతృవియోగం పొందిన పినపాక ఎమ్మెల్యే పాయంకి  పరామర్శ

-స్వర్గస్థులైన పద్మశ్రీ ఆవార్డు గ్రహీత సకిన రాంచంద్రయ్యకు నివాళి 

-భట్టితో కలిసి పర్యటన చేయనున్న మంత్రులు కోమటిరెడ్డి, పొంగులేటి, తుమ్మల

హైదరాబాద్, శోధన న్యూస్ : తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటిస్తున్నారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావులతో కలిసి కొత్త గూడెంలో పలు అభివృద్ది కార్యక్రమాలకు శంఖుస్థాపన చేస్తారు. వర్ష కాలం నేపత్యంలో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ముందస్తుగా గోదావరి వరదలపై కలెక్టరేట్ సంబంధిత శాఖల అధికారులతో సమీక్షిస్తారు. ఆతరువాత సహచర మంత్రులతో కలిసి మనుగూరు బయలుదేరి వెళ్లి మాతృవియోగం పొందిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లను పరమార్శిస్తారు. అదే విధంగా ఇటీవల స్వర్గస్థులైన పద్మశ్రీ ఆవార్డు గ్రహిత సకిన రాంచంద్రయ్య కుటుంబ సభ్యులను పరమార్శించి ప్రగాడ సంతాపం సానుభూతి తెలియజేస్తారు.

-డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క పర్యటన వివరాలు :
డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క సహచర మంత్రులతో కలిసి గురువారం ఉదయం హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి కొత్తగూడెంకు ఉదయం 9.30గంటలకు హెలిక్యాప్టర్లో బయలుదేరుతారు. ఉదయం 10.40 గంటలకు కొత్తగూడెంలోని ప్రగతిమైదాన్ ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క, ఇతర మంత్రులకు కొత్తగూడెం శాసన సభ్యులు కూనంనేని సాంబశివరావు, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్ ఐటీడీఏ పి.ఒ, జిల్లా ప్రజాప్రతినిధులు ఇతర అధికారులు స్వాగతం పలుకుతారు. విద్యానగర్ డిస్టిక్ మినరల్ ఫండ్స్ రూ.4కోట్లతో సైడ్ పనులకు శంకుస్తాపన చేసిన ఆనంతరం పోస్టుఆఫీసు సమీపంలో అమృత్ 2.0 నిధులు రూ.124 కోట్లతో కొత్తగూడెం మున్సిపాలిటికి శాశ్వత మంచినీటి సరఫరా పథకం పనులకు శంకుస్థాపన చేస్తారు. అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతారు. మధ్యాహ్నం 12.15 గంటలకు కలెక్టరేట్ చేరుకొని వర్షకాల నేపత్యంలో గోదావరి వరదలు వస్తే తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై అధికారులతో సమీక్షిస్తారు. మధ్యాహ్నం 1.45 గంటలకు కొత్తగూడెం నుంచి హెలిక్యాప్టర్ బయలుదేరి మనుగూరుకు చేరుకుంటారు. ఇటీవల స్వర్గస్తులైన పద్మశ్రీ ఆవార్డు గ్రహీత సకిన రాంచంద్రయ్య కుటుంబ సభ్యులను పరమార్శించి రాంచంద్రయ్య చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళీలు అర్పిస్తారు. ఆతరువాత పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు నివాసానికి చేరుకుంటారు. మాతృవియోగం పొందిన ఎమ్మెల్యే వెంకటేశ్వర్లును పరమార్శించిన ఆనంతరం హెలిప్యాడ్ చేరుకొని మనుగూరు నుంచి బయలుదేరి హైదరాబాద్ వెళ్తారు. డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క, ఇతర మంత్రుల పర్యటన నేపత్యంలో పోలీసులు బందోబస్తు చర్యులు చేపట్టారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తోన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *