తెలంగాణభద్రాద్రి కొత్తగూడెంమణుగూరు

సకిని  రామచంద్రయ్య మరణం జానపద కళకు తీరని లోటు

సకిని  రామచంద్రయ్య మరణం జానపద కళకు తీరని లోటు

– సకిని శ్రీ రామచంద్రయ్య కుటుంబానికి అండగా రాష్ట్ర ప్రభుత్వం  

– తెలంగాణ రాష్ట్ర పంచాయితీ రాజ్ మంత్రి  ధనసరి సీతక్క

 
మణుగూరు, శోధన న్యూస్ :  పద్మశ్రీ అవార్డు గ్రహీత సకిని  రామచంద్రయ్య మరణం జానపద కళకు తీరని లోటని తెలంగాణ రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు అనసూయ సీతక్క అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా   మణుగూరులో ఆదివాసీ దేవతలైన సమ్మక్క సారలమ్మ జీవిత చరిత్రను కంచు మేళం ద్వారా ప్రపంచానికి చాటి చెప్పిన సకిని పద్మశ్రీ అవార్డు గ్రహీత రామచంద్రయ్య  ఇటీవలే ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతు మరణించగా  రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు సీతక్క వారి కుటుంబాన్ని పరామర్శించి వారి చిత్ర పటం వద్ద నివాళులర్పించారు. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ.. పద్మశ్రీ అవార్డు గ్రహిత సకిని రామచంద్రయ్య మృతి జానపద కళకు తీరని లోటు అని, వారసత్వంగా వచ్చిన గిరిజన సంప్రదాయ కళను జీవనాధారంగా చేసుకొని అంతరించిపోతున్న డోలు వాయిద్యానికి జీవం పోసి.. గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడి ఉమ్మడి ఖమ్మం జిల్లాకే కాదు తెలంగాణ రాష్ట్రానికి తన డోలు వాయిద్యంతో దేశవ్యాప్తంగా కీర్తిని సాధించి పెట్టారు. వారి అకాల మరణం పట్ల వారి కుటుంబానికి నా ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలియజేస్తున్నాను అని మంత్రి సీతక్క గారు అన్నారు రామచంద్రయ్య గారి కుటుంబానికి అండగా రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది అని సీతక్క గారు వారి కుటుంబానికి భరోసా ఇచ్చారు.  ఈ కార్యక్రమంలో పినపాక ఎంఎల్ఏ పాయం వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ తో పాటు కాంగ్రెస్ పార్టీ జిల్లా బ్లాక్ మండల గ్రామ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *