ఆర్ టిఎస్ ను జెన్కో నే నిర్మించాలని నిరసన
ఆర్ టిఎస్ ను జెన్కో నే నిర్మించాలని నిరసన
మణుగూరు, శోధన న్యూస్ : టీజీ జెన్కో ఆధ్వర్యంలోనే రామగుండంలోని ఆర్ టిఎస్ ( రామగుండం ధర్మల్ స్టేషన్ ) విద్యుత్ కేంద్రాన్ని నిర్మించాలని డిమాండ్ చేస్తూ బీటీపిఎస్ చీఫ్ ఇంజనీర్ కార్యాలయం ఎదుట తెలంగాణ పవర్ ఎంప్లాయిస్( టిజిపిఈ) జెఏసి సభ్యులు గురువారం నిరసన తెలిపారు.ఆర్ టిఎస్ ను జెన్కోనే నిర్మించాలని, ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలంటూ ప్ల కార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జెఏసి నాయకులు ప్రసంగిస్తూ రామగుండం లో జెన్కో ఆధ్వర్యంలో ఉన్న ఆర్ టిఎస్ జీవన కాలం పూర్తవడంతో ఇటీవలే మూసివేసారని చెబుతూ.. ఆ స్థానం లో నిర్మించబోయే విద్యుత్ కేంద్రాన్ని సింగరేణికి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం చూడడం సరైన చర్య కాదని విమర్శించారు. అక్కడ విద్యుత్ కేంద్ర నిర్మాణాన్ని సింగరేణి కాకుండాజెన్కో కే అప్పగించాలని డిమాండ్ చేశారు.కొత్త విద్యుత్ కేంద్రాలను నిర్మించే సాంకేతిక పరిజ్ఞానం జెన్కో ఉద్యోగులకు ఉందని గుర్తు చేశారు. జెన్కో ఆధ్వర్యంలో నిర్మిస్తే విద్యుత్ సంస్థ తో పాటు ఉద్యోగులకు లాభదాయకంగా ఉంటుందని చెప్పారు.ఆర్ టిఎస్ లో నిర్మించ బోయే విద్యుత్తు కేంద్రాన్ని జెన్కోకు అప్పగించే వరకు జెఏసి ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. నిరసన కార్యక్రమం అనంతరం చీఫ్ ఇంజనీర్ బి బిచ్చన్నకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జెఏసి నాయకులు ఎస్ శ్రీనివాస్ రెడ్డి, సి రాజబాబు, నరేష్, వి ప్రసాద్, ఎస్ సత్యనారాయణ,బి కృష్ణ వీరస్వామి, దయాకర్,వెంకట్రామ్, ఆర్ రామచందర్ పాల్గొన్నారు.