శ్రీ కనకదుర్గమ్మ పుష్కర వార్షికోత్సవం
పీవీ కాలనీ శ్రీ కనకదుర్గమ్మ పుష్కర వార్షికోత్సవం
-భక్తి శ్రద్ధలతో చండీయాగం, మహా కుంభాభిషేకం
-భక్తులకు అన్నప్రసాద కార్యక్రమం
మణుగూరు, శోధన న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం పీవి కాలనీ శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి 12వ పుష్కర వార్షికోత్సవం పురస్కరించుకుని శనివారం ఆలయంలో చండీయాగం నిర్వహించారు. ప్రత్యేక పూజా కార్యక్రమాలు కూడా చేపట్టారు. ఆలయ అర్చకులు రమేష్ అయ్యగారు నేతృత్వంలో ప్రచండ చండీయాగం రంగ రంగ వైభవంగా నిర్వహించారు, ఉదయం 5 గంటలకు అమ్మవారికి సుప్రభాత సేవ అభిషేకములు 6 గంటలకు గణపతి పూజ పుణ్యాహ వాచనం శ్రీ చక్రావణ నవదుర్గ దేవతల, కుంభాభిషేకం కార్యక్రమంలో కూడా భక్తులు ప్రత్యేకించి దంపతులు ఎంతో భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. కాలనీ, సమీప గ్రామాలు చెందిన భక్తులు పెద్ద ఎత్తున శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నప్రసాద కార్యక్రమాలు కూడా నిర్వహించారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు.