ధరణి దరఖాస్తుల పరిష్కారానికి కట్టుదిట్టమైన చర్యలు
ధరణి దరఖాస్తుల పరిష్కారానికి కట్టుదిట్టమైన చర్యలు
– సిసిఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్
భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పెండింగ్ లో ఉన్న ధరణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి పరిష్కారానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సిసిఎల్ఏ కమీషనర్ నవీన్ మిట్టల్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. శనివారం సిసిఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లతో పెండింగ్ ధరణి సమస్యల పరిష్కారంపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జూన్ 15 నుంచి జూన్ 28 వరకు పెండింగ్ ధరణి దరఖాస్తుల పరిష్కారానికి తీసుకున్న చర్యలపై జిల్లాల వారీగా అడిగి తెలుసుకున్నారు. ఎన్ఆర్ఐ పట్టా పాస్ పుస్తకం, కోర్టు కేసు, కోర్టు వివాదంలో ఉన్న పట్టా పాస్ పుస్తకం, డేటా కరెక్షన్, జిపిఏ, ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ, నూతన పట్టా పాస్ పుస్తకాల జారీ, నాలా, ఖాతా మెర్జింగ్, భూ సంబంధిత ఫిర్యాదులు, నాలా పిపిబి, పెండింగ్ మ్యూటేషన్, సక్సెషన్, అర్భన్ ల్యాండ్ మొదలగు అంశాలపై వచ్చిన దరఖాస్తులను పరిష్కరించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు.
సీసీఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ మాట్లాడుతూ, అందుబాటులో ఉన్న రికార్డులను పరిశీలించి, క్షేత్రస్థాయిలో విచారణ చేసిన తరువాత సంబంధిత ధరణి దరఖాస్తులను ఆన్లైన్లో అప్డేట్ చేసి డిస్పోజ్ చేయాలని అన్నారు. ఆధార్ బయోమెట్రిక్ వేలి ముద్ర స్వీకరణ సంబంధించి ఎల్ 0 పరికరాల వినియోగ గడువు ముగుస్తున్న నేపథ్యంలో జిల్లాలకు ఎల్-1 బయోమెట్రిక్ పరికరాలు పంపడం జరిగిందని, వీటిని సరిగ్గా రీప్లేస్ చేయాలని అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ కొత్తగూడెం జిల్లాలో ధరణి దరఖాస్తుల పరిష్కారం వారం రోజుల్లో పూర్తి చేసి ఆన్లైన్ లో పెండింగ్ ధరణి దరఖాస్తులు డిస్పోజ్ చేస్తామని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఆర్ డిఓలు మధు, దామోదర రావు, తహసీల్దార్ లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.