మొక్కలు నాటిన సింగరేణి సివిల్ రైల్వే కాంట్రాక్ట్ వర్కర్స్
మొక్కలు నాటిన సింగరేణి సివిల్ రైల్వే కాంట్రాక్ట్ వర్కర్స్
మణుగూరు, శోధన న్యూస్ : ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సిఎండి)ఎన్ బలరాం నాయక్ స్పూ ర్తితో సింగరేణి సివిల్ రైల్వే కాంట్రాక్ట్ వర్కర్స్ ఆదివారం కొండాపురం సి ఎస్ పి రైల్వే ట్రాక్ సమీపంలో విద్యుత్ లైన్ లకు దూరంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సామాజిక కార్యకర్త పర్యావరణ ప్రేమికుడు అంగోత్ మంగీలాల్ మాట్లాడుతూ సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ బలరాం గారు ఎంతో పని ఒత్తిడితో ఉన్నప్పటికీ ఇప్పటికే 20 వేల పైచిలుకు మొక్కలు నాటారని వాటి సంరక్షణ బాధ్యతలు కూడా చూస్తున్నారని ఆయన స్ఫూర్తితో తామంత మొక్కలు నాటి వాటి సంరక్షణకు కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు , మణుగూరు ఏరియా సింగరేణి యాజమాన్యం సహకారంతో త్వరలో స్థానిక జడ్పీ స్కూల్ ఆవరణలో కూడా పెద్ద ఎత్తున పండ్ల మొక్కలు నాటే కార్యక్రమానికి కార్యాచరణ చేపట్టామని ఆయన విలేకరులకు తెలిపారు,ఈ కార్యక్రమంలో కాంట్రాక్ట్ వర్కర్స్ కే గురుమూర్తి, యు శివమకృష్ణ, జి నాగేశ్వరరావు, శ్రీనివాస్ ఎం టైసన్, కే నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.