కరకగూడెంతెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

నేతకాని సమస్యలు వెంటనే పరిష్కరించాలని  లక్ష సంతకాల ఉద్యమం

నేతకాని సమస్యలు వెంటనే పరిష్కరించాలని  లక్ష సంతకాల ఉద్యమం

  •  ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, రాష్ట్రపతి లకు ఈ కాఫీ లను ఇవ్వాలని నిర్ణయం
  •   సమస్యలు పరిష్కరించకుంటే   అసెంబ్లిని, పార్లమెంట్ లను ముట్టడిస్తాం 
  • నేతకాని ప్రజా జేఏసి నాయకులు జాడి ఈశ్వర్  

కరకగూడెం,శోధన న్యూస్: నేతకాని సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ నేతకాని సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నేతకాని ప్రజా జేఏసీ నాయకులు జాడి ఈశ్వర్ నేతకాని ఆధ్వర్యంలో రాష్ట్ర మంతా నేతకాని కులస్తులు లక్ష సంతకాల సేకరణ ఉద్యమాన్ని ప్రారంభించారు. లక్ష సంతకాల సేకరణ ఉద్యమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో సిఎం రేవంత్ రెడ్డి గారు నేతకాని కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని, ఆ మాట నిలబెట్టుకోవాలని నేతకాని కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఏజెన్సీ ప్రాంతంలో వందల శతాబ్దాల నుండి ఇక్కడే పుట్టి, ఇక్కడే జీవిస్తున్న మా కులస్తులకు భూమి పై, భుక్తి పై హక్కులు కల్పించకుండా , ఏదో తప్పు చేసినా ఖైదీలకు శిక్ష విధించనట్టుగా, మాకు హక్కులు కల్పించకుండా దౌర్భాగ్య స్థితిలో బ్రతకండి అనేలా చట్టాలు లేకుండా శిక్ష విధించడం న్యాయం కాదని, హత్య చేసినోనికి 14 ఏళ్ల శిక్షే ఉంటుందని, కానీ మేము ఏమి తప్పు చేశామని మాకు హక్కులు లేకుండా బ్రతమని శిక్ష వేశారని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను నిలదీశారు. వెంటనే మా నేతకాని కులస్తులకు ఏజెన్సీ చట్టాలు వర్తింపజేసేలా చట్టాలు తీసుకు రావాలని లేని పక్షంలో అసెంబ్లీ, పార్లమెంట్ ని లక్షలాది నేతకాని కుల ప్రజలతో ముట్టడిస్తామని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను హెచ్చరించారు. నేతకాని ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, ఏజెన్సీలో మా కులానికి ఏజెన్సీ చట్టాలు వర్తింపజేయాలని, మా కులస్తుల పిల్లల చదువుకోసం నేతకాని మినీ గురుకులం హన్మకొండలో ఏర్పాటు చేయాలని, రాష్ట్ర రాజధాని వేదికగా హైదారాబాద్ లో మా కుల భవనం ఏర్పాటు చేయాలనీ కోరుతూ పలు డిమాండ్లతో లక్ష సంతకాల సేకరణ ఉద్యమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఈ లక్ష సంతకాల సేకరణ అనంతరం ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రి, రాష్ట్రపతి లకు ఆ సంతకాల పత్రాలను అందజేయనున్నట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *