అధికారులు నిబద్దతతో విధులు నిర్వర్తించాలి
అధికారులు నిబద్దతతో విధులు నిర్వర్తించాలి
- ముంపు ప్రాంతాలను గుర్తించి చర్యలు చేపట్టండి
- సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలి
- సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
మణుగూరు, శోధన న్యూస్ : అధికారులు నిబద్దతతో విధులు నిర్వర్తించాలని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని ప్రజా భవన్ లో నియోజక వర్గ ఎంపిడిఓ, రెవిన్యూ, మున్సిపల్ అధికారులతో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. పలు సూచనలు చేసీ పలు నివేదికల పై ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం అందించే పథకాలు అసలైన అర్హులకు చేరే విధంగా కృషి చేస్తూ నిబద్ధత వివిధ సమస్యలపై వచ్చే రైతులను పేదలను ఇబ్బంది పెట్టకుండా వెంటనే సమస్యలు పరిష్కరించడంతో పాటు ముంపునకు గురి అయ్యే ప్రాంతాలను గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవాలని, పెండింగ్ లో ధరణి సమస్యలు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని, ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ సమస్యలు వెంటనే పరిష్కరించాలని సూచించారు. గత ఐదు సంవత్సరాలలో వరద ముంపుకు గురైన బూర్గంపాడు, అశ్వాపురం, పినపాక, మణుగూరు ప్రాంతాల వివరాలు వర్షపాత నమోదు ఆ సమయంలో పునరావాస కేంద్రాల వివరాలు అందించాలన్నారు. కార్యదర్శులు, మండలాధికారులు సమన్వయం చేసుకుంటూ అప్రమత్తంగా ఉండాలి ప్రాణ నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాకాలం నేపథ్యంలో రోగాలు ప్రబలకుండా పరిశుభ్రతపై దృష్టి సారించి రోడ్లపై నీరు నిలవకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. బ్లీచింగ్, ఫాగింగ్ దోమల వ్యాప్తిని అరికట్టడంతో పాటు గ్రామాలు పచ్చదనంతో, పరిశుభ్రతతో ఫరిడవిల్లాలన్నారు.
అగ్ని ప్రమాదాలతో ఇల్లు కాలిపోయిన వారి వివరాలను సేకరించి త్వరలో రాబోయే ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో వారికే ప్రాముఖ్యత ఇవ్వాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న గ్యాస్ కనెక్షన్, 200 యూనిట్ల ఉచిత కరెంటు పై అసలు ఆయీన అర్హుల నుంచి ఫిర్యాదులు అందితే తక్షణమే వాటిని పరిష్కరించి భరోసా కల్పించాలన్నారు.
ధరణిలో కొత్త మార్పులు రానున్న సందర్భంలో పెండింగ్లో ఉన్న సమస్యలను వాటిని పరిష్కరించాలన్నారు.
నియోజకవర్గంలోని అన్ని మండలాల వారీగా పూర్తి స్థితిగతుల వివరాలు నివేదికలు వెంటనే అందజేయాలన్నారు.
శాశ్వత భవనాలు లేని కార్యాలయాలకు స్థల సేకరణ చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు.
మణుగూరు మున్సిపాలిటీలో రోడ్లన్నీ శుభ్రంగా ఉంచడంతో పాటు కాల్వల్లోన్ని చెత్తను వెంటనే తొలగించాలని మున్సిపాలిటీ అధికారులను ఆదేశించారు. సమస్యలపై ప్రజల నుంచి పిర్యాదులు రావొద్దని అన్నారు. త్వరలో ప్రతి వార్డుకు పాదయాత్ర చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ అధికారులు సమస్యలపై వచ్చే బాదితులకు తక్షణమే పరిష్కరించి న్యాయం చేయాలన్నారు. విధి నిర్వహణ లో అశ్రద్ధ వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ సమావేశంలో డిఆర్డిఏ పిడి విద్యాచందన నియోజకవర్గంలోని అన్ని మండలాల రెవిన్యూ మండల పరిషత్ అధికారులు మణుగూరు మున్సిపాలిటీ కమిషనర్ సిబ్బంది పాల్గొన్నారు.