సంపూర్ణ అభియాన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
సంపూర్ణ అభియాన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్
భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్ : సంపూర్ణ అభియాన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. నీతి ఆయోగ్ ఆస్పిరేషనల్ జిల్లా మరియు ఆస్పిరేషనల్ మండలం కార్యక్రమం లో భాగంగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఐడిఓసి కార్యాలయం లోని సమావేశ మందిరం లో సంబందిత జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజలకు కావలసిన విద్య, వైద్యం, పౌష్టిక ఆహరం ,వ్యవసాయం మరియు సామాజిక అభివృద్ధి తదితర అంశాలలో జిల్లా మరియు గుండాల మండల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఈ అంశాలలో అభివృద్దిని మరింత వేగవంతంగా సాదించటానికి “ సంపూర్ణత అభియాన్” కార్యక్రమము ను జిల్లా స్థాయిలో 4 వ తేదిన, గుండాల మండలం లో 5 వ తేదిన జరుగుతుంది అని తెలిపారు. రాబోయే మూడు నెలల కాలంలో ప్రణాళిక బద్దంగా సూచికలను నూరు శాతం సాదించటమే ఈ “సంపూర్ణత అభియాన్” కార్యక్రమ ముఖ్య లక్ష్యం అని కలెక్టర్ తెలిపారు. ఇందుకు సంబందించిన ఏర్పాట్లను సంబందిత జిల్లా అధికారులను అడిగి తెలుసుకున్నారు. వైద్య శాఖకు సంబంధించి ఇంటింటి సర్వే నిర్వహిoచి, గర్బిణి స్త్రీల నమోదు,రక్తపోటు మరియు మధుమేహం పరీక్షలు చేయాలని, పోషక ఆహారానికి సంబంధించి గర్భిణులకు సప్లమెంటరీ న్యూట్రిషన్ అందించాలన్నారు. వ్యవసాయానికి సంబంధించి భూసార పరీక్షలు చేసి సాయిల్ హెల్త్ కార్డ్ రైతులకు అందించాలని, మహిళా సంఘాలకు రుణాలు అందించాలని సంబందిత అధికారులు వాటి అమలు పర్యవేక్షించి రాబోయే మూడు నెలల కాలంలో ప్రణాళిక బద్దంగా సూచికలను నూరు శాతం సాదించటమే ఈ “సంపూర్ణత అభియాన్” కార్యక్రమము యొక్క ముఖ్య లక్ష్యం అని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఓ విద్యా చందన, సిపిఓ శ్రీనివాస్ రావు, మహిళా శిశు సంక్షేమ అధికారి విజేత, జిల్లా వైద్య శాఖ అధికారి భాస్కర్ నాయక్, వ్యవసాయ శాఖ ఏడి సాయి, సిఎంఓ నాగ రాజశేఖర్, ఆస్పిరేషనల్ బ్లాక్ ఫెల్లో నవనీత్ తదితరులు పాల్గొన్నారు.
s