అన్నదాన కార్యక్రమానికి బియ్యం అందజేత
అన్నదాన కార్యక్రమానికి బియ్యం అందజేత
మణుగూరు, శోధన న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని పైలెట్ కాలనీలో గల శ్రీశ్రీశ్రీ కాళీమాత ఆలయంలో గురువారం అన్నదాన కార్యక్రమానికి పినపాక నియోజకవర్గ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం ఆధ్వర్యంలో 50 కేజీలు బియ్యం కాళీమాత ఆలయ పూజారికి సంఘయాం గౌరవ అధ్యక్షులు బేతంచెర్ల వెంకటేశ్వరరావు చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమం లో పినపాక నియోజకవర్గ పవన్ కళ్యాణ్ అభిమానులు సురేందర్ పటేల్, ప్రదీప్ నాయుడు, సాయిని బాలయ్య, బండ్ల బాలా నాయుడు, బత్తుల అనిల్, మహేష్ రెడీ మెడ్స్, మహేష్, బీరువా షాపు వాసు, లక్ష్మి శెట్టి ప్రసాద్, డేరంగుల నరసింహ, అమూల్ శ్రీనివాస్, లక్ష్మీ శెట్టి ప్రసాద్, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.