తెలంగాణభద్రాద్రి కొత్తగూడెంమణుగూరు

బొగ్గు గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఐఎన్ టియుసి  ధర్నా

బొగ్గు గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఐఎన్ టియుసి  ధర్నా

కేంద్ర ప్రభుత్వం స్పందించకుంటే ఆందోళనలు ఉదృతం చేస్తాం

-ప్రధాన కార్యదర్శి సిల్వేరు గట్టయ్య 

 మణుగూరు, శోధన న్యూస్ : బొగ్గు గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కేంద్ర నాయకత్వం ఐఎన్ టీయుసి సెక్రటరీ జనరల్  బి జనక్ ప్రసాద్ ,సెక్రటరీ జనరల్  సి త్యాగరాజన్  పిలుపు మేరకు ఐఎన్ టీయుసి మణుగూరు బ్రాంచ్ కమిటీ ఆద్వర్యం లో    మణుగూరు జీ ఎం  ఆఫీస్ వద్ధ ధర్నా  నిర్వహించారు. అనంతరం ఏరియా జిఎం దుర్గం రామచందర్  కి వినతి పత్రం అందజేశారు.   ఈ సందర్భంగా ఐ ఎన్ టి యు సి మణుగూరు బ్రాంచ్ ప్రధాన కార్యదర్శి సిల్వేరు గట్టయ్య మాట్లాడుతూ అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లుగా జాతీయ సంపద అయిన కేంద్రం బొగ్గు బ్లాకులను ప్రైవేటీకరించే హక్కు మోడీకి ఎవరు ఇచ్చారని ఆయన ప్రశ్నించారు.  మోడీ కేడి గా మారి ప్రజల సొమ్మును కార్పొరేట్ సంస్థలకు ధారా దత్తం చేస్తున్నాడని ఆయన మండిపడ్డారు, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం స్పందించి సింగరేణికి బొగ్గు బావులను కేటాయించకుంటే ఆందోళనలు ఉదృతం చేస్తామని ఆయన ఈ సందర్భంగా కేంద్రాన్ని హెచ్చరించారు, కన్నతల్లి సింగరేణి కాపాడుకునే విషయంలో కార్మికులు అధికారులు సూపర్వైజర్లు అనే తారతమ్యం లేకుండా అంతా ఐక్యంగా నిలబడతారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.   ఈ కార్యక్రమం లో  ఐఎన్ టియుసి బ్రాంచి కార్యదర్శులు ఎస్ రాములు, ఎండి షాబుద్ధీన్,నాయుడు, బ్రాంచి ట్రెజరరీ శ్రీనివాస్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు షేక్ అబ్దుల్ రవూఫ్ ,జాయింట్ సెక్రటరీలు జీవరత్నం సంతోష్ చరణ్,రామారావు,బాగం రవి,యాకూబ్ పాషా , వివిధ గనుల పిట్ కార్యదర్శిలు మల్లికార్జున్, రాము, సురేష్, రామకృష్ణ, ధశరథ్,ఇతర నాయకులు డీఆర్ కే , కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *