ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి
-భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్
భద్రాద్రి కొత్తగూడెo, శోధన న్యూస్ : ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులు పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడిఓసి కార్యాలయ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్,స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీమతి విద్యా చందనతో కలిసి అన్ని శాఖల అధికారులతో ప్రజావాణి నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యల పరిష్కారా నికి సంబంధిత అధికారులకు ఎండార్స్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దరఖాస్తు చేసిన అభ్యర్థులను వివరాలను అడిగి తెలుసుకొని పరిష్కారాన్ని చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
సుజాతనగరం మండలం చుంచుపల్లి తండాకి చెందినా రమేష్ సుజాతనగర్ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 970 లో 4 మరియు 987 లో 3.25 గుంటల వారసత్వ భూమి కలిగి ఉన్నానని, కొత్త పట్టాదారు పాస్ బుక్ ఇప్పించవలసిందిగా చేసుకున్న దరఖాస్తును తగు చర్యలు నిమిత్తం సుజాతనగర్ తాసిల్దార్ కు ఎండార్స్ చేశారు.
రుద్రంపూర్ మండలం చుంచుపల్లి గ్రామంలో నివసిస్తున్న ఆర్కే. స్వామి సింగరేణి యాజమాన్యం వారు ఓపెన్ కాస్ట్ విస్తీర్ణం లో భాగంగా ఎస్ ఆర్ టి ఏరియాలో ఇళ్లను ఖాళీ చేస్తున్నారని, ఇల్లు కోల్పోయే వారికి ఇచ్చే నష్టపరిహారం క్రింద 100 గజాల చొప్పున స్థలాలు ఇచ్చిన ఇచ్చి ఉన్నారు, వారు ఎంక్వయిరీ సమయంలో మేము లేము అని అందుకని మాకు నష్టపరిహారం అందలేదని, తిరిగి రెండోసారి దరఖాస్తు చేసినప్పటికీ నష్టపరిహారం అందలేదని, మాది సొంత ఇల్లు మాకు అన్యాయం జరుగుతుందని చేసుకున్న దరఖాస్తు ను తగు చర్యలు నిమిత్తం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ల్యాండ్ ఆక్టివేషన్ కు ఎండార్స్ చేశారు.
పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని ఒడ్డుగూడెం ప్రజలు గత కొన్ని సంవత్సరాలుగా మా ప్రాంతమునకు మున్సిపల్ త్రాగునీరు సౌకర్యం లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని చేసిన దరఖాస్తును తగు చర్యల నిమిత్తం మున్సిపల్ కమిషనర్ పాల్వంచకు ఎండార్స్ చేశారు.పాల్వంచ మండలం పాలకోయ తండాలో నివసిస్తున్న జాల గంగోత్రి కొత్త రేషన్ కార్డు కోసం చేసిన దరఖాస్తును తగు చర్యల నిమిత్తం పౌర సరఫరాల అధికారికి ఎండార్స్ చేశారు.
మణుగూరు మండలం సమితి సింగారం గ్రామంలో నివసిస్తున్న షేక్ షమీన కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని,గత 12 సంవత్సరాలుగాకిరాయి ఇంట్లోఉంటూ జీవనం సాగిస్తున్నామని తమ ఆర్థిక పరిస్థితి బాగోలేదని, కుటుంబ పోషణ భారమైందని కిరాయిలు కట్టుకునే స్థితి లేనందువలన డబుల్ బెడ్ రూమ్ చేసిన దరఖాస్తును మణుగూరు తాసిల్దార్ కు ఎండార్స్ చేశారు.
అన్నపురెడ్డిపల్లి మండలం భీమునిగూడెం లో నివాసముంటున్న కలం వెంకటేశ్వర్లు తమకు ఊటుపల్లి రెవెన్యూ పంచాయతీ పరిధిలో సర్వేనెంబర్ 101 లో మూడు ఎకరాల వారసత్వ భూమి ఉన్నదని, సదరు భూమిని రెండుసార్లు సర్వే చేసినప్పటికీ ఇప్పటివరకు పట్టాదారు పాస్ పుస్తకం రాలేదని దానివలన నేను ప్రభుత్వ పథకాలు మరియు సొసైటీలో ధాన్యం అమ్మ లేకపోతున్నామని, మందు కట్టలు,విత్తనాలు కూడా ఇవ్వడంలేదని చేసిన దరఖాస్తును తగు చర్యల నిమిత్తం అన్నపురెడ్డిపల్లి తాసిల్దార్ కు ఎండార్స్ చేసి ఉన్నారు.
అనంతరం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులన్నిటికీ సత్వరమే పరిష్కారం చూపాలని తెలిపారు.సాధారణ బదిలీలలో భాగంగా అన్ని శాఖల అధికారులు తమ సిబ్బంది యొక్క బదిలీ దరఖాస్తులను ఈ నెల 9వ తేది నుండి 12వ తేది వరకు సమర్పించాలని ఆదేశించారు. 13వ తేది నుండి 18 వ తేది వరకు వచ్చిన దరఖాస్తుల పరిశీలన ఉంటుందని, తదుపరి ప్రభుత్వ ఆదేశాల మేరకు బదిలీలు చేపడతామని కలెక్టర్ తెలిపారు.బదిలీల దరఖాస్తులు సకాలంలో సమర్పించాలని అలసత్వం ప్రదర్శించొద్దని సూచించారు. అధికారులందరూ సమయపాలన పాటించాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులందరూపాల్గొన్నారు.