చిర్రకుంట చెరువుకు గండి
చిర్రకుంట చెరువుకు గండి
-వృధాగా పోతున్న నీరు
-ఆందోళనలో రైతన్నలు
కరకగూడెం,శోధన న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం పరిధిలోనే రాయణపేట గ్రామానికి చెందిన చిర్రకుంట చెరువు గండిపడి నీరు వృధాగా పోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి చెరువుకు గండిపడి నీరు వృధాగా పోతుండడంతో రైతులు నాట్లు వేసే సమయం వస్తున్నాడంతో చెరువుకు గండిపడి నిరు పోవటం వల్ల రైతులు పంట పండించడానికి నిటి కష్టాలు ఏర్పడి పంటలు ఎండిపోతాయని వెంటనే అధికారుల స్పందించి గండిపడిన చిర్రకుంట చెరువుకు మరమ్మత్తులు చేయవలసిందిగా రైతన్నలు వేడుకుంటున్నారు.