తెలంగాణభద్రాద్రి కొత్తగూడెంమణుగూరు

  పసుపు కార్డు, ఎరుపు కార్డు ఉత్తర్వులు రద్దు చేయాలి

  పసుపు కార్డు, ఎరుపు కార్డు ఉత్తర్వులు రద్దు చేయాలి
-అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఏరియా జిఎంకి వినతి  

మణుగూరు, శోధన న్యూస్ : సింగరేణి యాజమాన్యం ఇటీవల జారీ చేసిన నిరంకుశమైన పసుపు కార్డు, ఎరుపు కార్డు ఉత్తర్వులు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మణుగూరు ఏరియా అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం ఏరియా జిఎం దుర్గం రామచందర్ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కార్మికుల క్రమ శిక్షణా చర్యలకు సంబంధించి ఇటీవల సింగరేణి యాజమాన్యం జారీ చేసిన పసుపు కార్డు,రెడ్ కార్డు ఉత్తర్వులు నిరంకుశమైనవని ఈ సర్క్యులర్ అమలు తో కార్మికులు విధి నిర్వహణలో తీవ్ర భయ బ్రాంతులకు గురవుతున్నారన్నారు, వెంటనే పసుపు కార్డు, ఎరుపు కార్డులను రద్దు చేయాలని మణుగూరు ఏరియా అఖిలపక్ష కార్మిక సంఘాలుగా డిమాండ్ చేస్తున్నామన్నారు. గనులలో లేదా పని ప్రదేశాలలో ప్రమాదాలు జరిగితే కేవలం కార్మికుల్ని మాత్రమే పూర్తి బాధ్యుల్ని చేసే అప్రకటిత నిర్బంధం ప్రయోగించి చార్జ్ షీట్లు, మెమొలు, సస్పెండెడ్ పెండింగ్ ఎంక్వయిరీ ,షోకాస్ నోటీసులు ఇవ్వడంతో పాటు కార్మికుల్ని మానసికంగా వేధించే ఈ సర్క్యులర్ రద్దు చేసేందుకు తగు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.

ఉత్పత్తి లక్ష్య సాధనతో పాటు పూర్తిస్థాయి రక్షణ చర్యలపై కూడా యాజమాన్యం దృష్టి పెట్టాలి అప్పుడు మాత్రమే ప్రమాదాలు నివారించబడతాయని వారు అభిప్రాయపడ్డారు.  ఏ తరహా నేరస్తుడో పలకపై అక్షరాలు దిద్ది దోషి మెడలో వేలాడదీసిన నాటి బ్రిటిష్ బానిస సామ్రాజ్యపు కఠిన నిబంధనలు ప్రజాస్వామిక దేశంలో సరికాదని ఈ విధానం కార్మికుల పట్ల యాజమాన్యం వ్యవహరించే అమర్యాద చర్యగా వారు అభివర్ణించారు,వెంటనే సంబంధిత సర్క్యులర్ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.  లేనియెడల రాజకీయాలకతీతంగా అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు తప్పవని కూడా వారు హెచ్చరించారు.

అదేవిధంగా ప్రైవేటు కన్వీనెన్స్ వాహన డ్రైవర్లకు సంబంధించి నాలుగు నెలలుగా వాహన యజమానులు జీతాలు చెల్లించడం లేదని సమస్యను అధికారుల దృష్టికి తీసుకు వెళ్లినా కూడా సమస్య పరిష్కారం కాకపోవటం బాధాకరమన్నారు.  ప్రైవేటు వాహన డ్రైవర్లు నిత్యవసర వస్తువుల కొనుగోలుకు కూడా ఇబ్బంది పడుతున్నారన్నారు.  ఇక పిల్లల పాఠశాల ఫీజులు ఎలా చెల్లిస్తారని వారు ప్రశ్నించారు, ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి సమస్య పరిష్కరించాలని కోరారు.  అలాగే ఏరియా హాస్పిటల్ లో వైద్యుల పోస్టులు భర్తీ చేయాలని మెరుగైన వైద్య సేవలు అందించాలని, పివి కాలనీలో దోమల నివారణకు ఫాగింగ్ నిర్వహించాలని కోరారు.  ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు వై రాంగోపాల్, మేకల ఈశ్వర్, ప్రవీణ్ బాబు, ఐ ఎన్ టి యు సి నాయకులు నాయకులు సిల్వేరు గట్టయ్య,సిఐటియు నాయకులు ఎం సుమన్,హెచ్ఎంఎస్ నాయకురాలు కొడిపల్లి శ్రీలత, బి ఎం ఎస్ నాయకులు భూక్యా కిషన్,ఐ ఎఫ్ టి యు నాయకులు యస్ డి నా సర్ పాషా, ఏ మంగీలాల్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *