BadradrikothagudemTelangana

 కోర్టు డ్యూటీ అధికారులు బాధ్యతగా విధులు నిర్వర్తించాలి

 కోర్టు డ్యూటీ అధికారులు బాధ్యతగా విధులు నిర్వర్తించాలి

జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న కోర్టు డ్యూటీ ఆఫీసర్స్,స్టేషన్ రైటర్స్,కంప్యూటర్ ఆపరేటర్స్ తో సమావేశాన్ని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఏర్పాటు చేశారు.

 కొత్తగూడెంలోని ఐఎంఏ ఫంక్షన్ హాల్ నందు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు   జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కోర్టు డ్యూటీ కానిస్టేబుళ్లు,రైటర్లు,టెక్ టీం ఆపరేటర్లతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..పెండింగ్లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి బాధ్యతగా విధులు నిర్వర్తించాలని సూచించారు.న్యాయాధికారులతో సమన్వయం పాటిస్తూ పాత కేసుల పరిష్కారానికి కృషి చేయాలని తెలిపారు.

ఐటీ సెల్ సహకారం తీసుకోవాలి

కేసుల పురోగతిని ఎప్పటికప్పుడు తమ అధికారులకు తెలియజేస్తూ ఉండాలని సూచించారు.ఏవైనా సందేహాలు తలెత్తితే డీసిఆర్బీ అధికారులకు తెలియజేసి వాటిని నివృత్తి చేసుకోవాలని తెలిపారు.కేసు నమోదు అయినప్పటి నుండి పరిష్కారం అయ్యే వరకు ప్రతి విషయాన్ని ఆన్లైన్లో పొందుపరిచాలని టెక్ టీం ఆపరేటర్లకు సూచించారు.

ఆన్లైన్లో పొందుపరిచే క్రమంలో ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే ఐటీ సెల్ సహకారం తీసుకోవాలని అన్నారు.నేరస్తులకు శిక్ష పడే విధంగా కృషి చేసి బాధితులకు న్యాయం చేకూర్చడంలో ప్రతి ఒక్కరి పాత్ర కీలకమని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *