విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించాలి.
విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించాలి.
జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్.
సంపూర్ణత అభియాన్ లో భాగంగా శుక్రవారం ములకలపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల మరియు కస్తూరిభా గాంధీ బాలికా విద్యాలయం నుశుక్రవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ పరిశీలించారు. జూనియర్ కళాశాల పరిసరాలను, భవనాన్ని పరిశీలించి, కళాశాల ఆవరణ లో గడ్డి , పిచ్చి మొక్కలు ఉండటం గమనించారు. కళాశాల ఆవరణం పరిశుభ్రంగా ఉంచాలని గడ్డి , పిచ్చి మొక్కలు తొలగించాలని ఆదేశించారు.
కళాశాల భవనం , విద్యుదీకరణ పనులు, మంచినీటి సౌకర్యం, తరగతి గదుల ఫ్లోరింగ్, తలుపులు, రంగులు తదితర అన్ని మౌలికలు సదుపాయాలు కల్పించడానికి కావలసిన ప్రతిపాదనలు సమర్పించవలసిందిగా పంచాయతీరాజ్ ఈ ఈ శ్రీనివాసరావుని ఆదేశించారు.
కళాశాల ఆవరణలో వాలీబాల్, షటిల్ కోర్టులు, వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని మరియు విశాలమైన ఆవరణంలో మునగ,చింత,ఉసిరి,వెలగ మరియు కరివేపాకు చెట్లను నాటాలని సూచించారు.విద్యార్థులు ప్రశాంతమైన వాతావరణం లో విద్యనభ్యసించడానికి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.
కళాశాల ఆవరణలో ఉన్న కోణా కార్పస్ చెట్లను తొలగించాలని ఆదేశించారు. కళాశాలఉపాధ్యాయులతో మాట్లాడుతూ విద్యార్థులకు ఒకేషనల్ తరగతులలో కావలసిన పరికరాలు అమర్చి తగిన శిక్షణ ఇవ్వవలసిందిగా తెలిపారు .
అనంతరం ములకలపల్లి కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం ను పరిశీలించారు కళాశాల విద్యార్థినిలతో కలెక్టర్ మాట్లాడి వారికి అందుతున్న ఆహారం మరియు మౌలిక సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు.
కళాశాలలోని మెనూ ప్రకారం ఆహారం అందించాలని ఆదేశించారు. సెకండ్ ఇయర్ ఎం పి హెచ్ ఎస్ తరగతిగదిలో కలెక్టర్ వెళ్లి విద్యార్థులతో మాట్లాడుతూ నర్సింగ్ కోర్సు చేయడం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా, దేశ వ్యాప్తంగా ఉపాధి దొరుకుతుందని, ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని విద్యార్థిని లు శ్రద్ధగా విద్యనభ్యసించాలని సూచించారు. మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ కోర్స్ లో రాష్ట్రస్థాయిలో రెండవ స్థానం సాధించిన పి సౌమ్య అనే విద్యార్థినిని అభినందించారు.