సమీకృత వ్యవసాయం ద్వారా రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చు
సమీకృత వ్యవసాయం ద్వారా రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చు .
జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.
ములకలపల్లి మండలం కొత్తూరు గ్రామం లోని సోయం కృష్ణ అనే రైతు వేసిన మునగ నర్సరీను జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్ ఆర్ జి ఎస్ ద్వారా మునగ పంటను వేస్తున్న వారికి అన్ని విధాలుగా ప్రోత్సాహకాలు,సబ్సిడీ లు అందుతాయని అదేవిధంగా పంట చేనులో ఫారం పాండ్లు ఎనర్జీఎస్ ద్వారా తీయించడం జరుగుతుందని ఈ ఫారం పాండ్లలో రైతు చేపల పెంపకం చేసుకుంటే లాభదాయకంగా ఉంటుందని తెలిపారు.
అనంతరం తేనెటీగలు పెంపకం తో పాటు సమీకృత వ్యవసాయం చేస్తున్న చందర్రావు రైతు తోటను కలెక్టర్ పరిశీలించారు ఈ సందర్భంగా రైతు సమీకృత వ్యవసాయ క్షేత్రంలో భాగంగా పామాయిల్ తోటలో పామాయిల్ తోట తో పాటు జామ పంటను పరిశీలించి దీనితోపాటు మునగ సాగు కూడా చేపట్టాలని సూచించారు.
పశు సంరక్షణలో భాగంగా పశువుల పెంపకం తో పాటు వాటి పేడతో స్వయంగా ఎరువులు తయారు చేస్తూ తోటలకు ఎరువుగా ఉపయోగించడం ఆయన తెలుసుకున్నారు.మరియు పామాయిల్ తోటలోనాటు కోళ్ల పెంపకాన్నిపరిశీలించారు. అనంతరం కలెక్టర్ చందర్రావు దంపతులను సన్మానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఒక పంట మీదనే ఆధారపడకుండా సీజన్ వారీగా పంటలను పండిస్తూ, ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చు అని తెలిపారు. ములకలపల్లి మండలం పాతూరు కి చెందిన ఈదర మురళి అనే రైతు చేపల చెరువుతోపాటు బంతి సాగును పరిశీలించిన కలెక్టర్ రైతులందరూ ఈ విధంగా సమీకృత వ్యవసాయం చేయడం ద్వారా అధిక లాభాలు పొందాలి అని తెలియజేశారు.
ప్రతి గ్రామపంచాయతీలో అజోలా పెంపకం చేపట్టి వరి పంట వేసే రైతులందరికీ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. దీని ద్వారా రైతులకు ఎరువుల వినియోగం తగ్గుతుందని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి బాబురావు, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.