మా పంచాయతీలో దోమల మందు కొట్టండి మహా ప్రభు.
మా పంచాయతీలో దోమల మందు కొట్టండి మహా ప్రభు.
సమాచారం చెప్పిన నేడు,రేపు అని ! జ్వరాల బారిన పడితేనే కొడతారా !
కరకగూడెం,శోధన న్యూస్ :మండలంలో వర్షాలు పడుతున్న నేపథ్యంలో దోమలు ఈగలు సంతతి విపరీతంగా పెరిగి సాయంత్రం వేళల్లో ఇళ్లల్లోకి ప్రవేశించి ప్రజల్ని కుట్టి మలేరియా, డెంగ్యూ వ్యాధి బారిన పడేటట్టు ప్రభావం చూపుతాయి .
గ్రామాలలో మురికి కాలువలు నీటి గుంటలు, చెట్ల పొదలు డ్రైనేజీ వ్యవస్థ లేకుండ ఉన్న గ్రామాలలో నీరు నిల్వగా ఏర్పడి నప్పుడు దోమ లార్వాలు సంతతి విపరితంగా పెరిగి వ్యాధులు రావడానికి కారకాలు అవుతాయి.
వర్షాలు పడుతున్నప్పుడు నిరు కూడా కలుషితం అయ్యి టైఫాయిడ్ వ్యాధి వచ్చే అవకాశాలుంటాయి. మలేరియా, డెంగ్యూ వ్యాధులను కలిగించే దోమలను గ్రామాలలో పిచికారి చేసి అరికట్టాల్సిన బాధ్యత పంచాయతీ అధికారి పైన బాధ్యత ఉంది.
తాటిగూడెం గ్రామపంచాయతీలో దోమలు,ఈగలు విపరీతంగా ఉండి రాత్రి వేళలో కరెంటు పోతే వీరంగం సృష్టిస్తున్నాయి. అధికారులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చిన నేడు – రేపు సమాధానం.ఉన్నత అధికారులు స్పందించి ఈ దోమల బెడద నుండి విముక్తి కల్పించండి అని ప్రజలు కోరుతున్నారు.