సింగరేణి ఏరియా హాస్పిటల్ ను సందర్శించిన జీఎం
సింగరేణి ఏరియా హాస్పిటల్ ను సందర్శించిన జీఎం
మణుగూరు, శోధన న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియాలోని పీవీ కాలనీలో గల సింగరేణి ఏరియా హాస్పిటల్ ను ఏరియా జనరల్ మేనేజర్ దుర్గం రామచందర్ డివైసిఎంఓ మేరీ కుమారితో కలిసి శనివారం సందర్శించారు. ఏరియా హాస్పిటల్ లోని అన్నీ వార్డులను పరిశీలించారు. చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వారి ఆరోగ్య సమస్యల గురించి తెలుసుకున్నారు. వారికి అవసరమైన చికిత్స అందించాలని డాక్టర్లకు సూచించారు. ఈ సందర్భంగా ఏరియా జనరల్ మేనేజర్ రామచందర్మా ట్లాడుతూ… వర్షాకాలం లో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశాలున్నాయి. వాటి నుంచి కాపాడుకోవడానికి గాను ప్రజలందరు ఇంటా బయట పరిశుభ్రతను పాటించాలన్నారు. టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ వంటి విష జ్వరాలు దోమల వల్ల సోకుతాయని, వాటిని నివారించడానికి తగిన చర్యలు తీసుకోవడానికి వైద్య అధికారులకు సూచించారు. అలాగే వ్యాధుల నివారణకు అవసరమైన మందు సామగ్రిని అందుబాటులో ఉంచుకోవాలన్నారు. కాలనీల్లో నివసిస్తున్న కార్మికులను దోమలు, కుక్కల బెడద నుంచి కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని సిబ్బందిని, శానిటరీ ఇన్‌స్పెక్టర్ జి రామారావును ఆదేశించారు. తరచుగా ఉద్యోగుల కాలనీలలో దోమల నివారణకు ఫాగింగ్, మురుగు కాలువల పరిశుభ్రత చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సింగరేణి హాస్పిటల్ డాక్టర్ శేషగిరి రావు , హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
