తెలంగాణభద్రాద్రి కొత్తగూడెంమణుగూరు

సింగరేణి కాంటాక్ట్ కార్మికులకు రెయిన్ కోట్లు, ఆస్పత్రి పాస్ బుక్ లు ఇవ్వాలి

సింగరేణి కాంటాక్ట్ కార్మికులకు రెయిన్ కోట్లు, ఆస్పత్రి పాస్ బుక్ లు ఇవ్వాలి

మణుగూరు, శోధన న్యూస్ : సింగరేణి కాంటాక్ట్ కార్మికులకు రెయిన్ కోట్లు, ఆస్పత్రి అటెండెన్స్ పాస్ బుక్కులు ఇవ్వాలని కోరుతూ సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఇఫ్టూ) మణుగూరు బ్రాంచ్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియా ఎస్ ఓ టు జి ఎం డి శ్యామ్ సుందర్ కి, ఏజీఎం సివిల్ ధనసరి వెంకటేశ్వర్లు కి వినతిపత్రం అందజేశారు.    ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు మంగీలాల్ మాట్లాడుతూ.. మణుగూరు ఏరియా రైల్వే కాంట్రాక్ట్ కార్మికులు మేస్త్రిలు, సివిల్, రోడ్స్ క్లీనింగ్, పర్చేజ్ మరియు ఇతర విభాగాల కార్మికులు వర్షంలో సైతం తడుస్తూ పనిచేయాల్సి ఉంటుందని, అలా పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులకు, సూపర్వైజర్లకు, పారిశుద్ధ్య కార్మికులకు, ఉద్యానవన కాంట్రాక్ట్ కార్మికులకు సింగరేణి యాజమాన్యం నేరుగా రెయిన్ కోట్లు అందజేసే విధంగా తగు చర్యలు చేపట్టాలని కోరారు.   అలాగే కాంట్రాక్ట్ కార్మికులతో పాటు ప్రైవేటు సెక్యూరిటీ గార్డులకు  సింగరేణి ఉచిత వైద్య పుస్తకాలు  ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్ట్ కార్మికులు కే గురుమూర్తి, షేక్ రజబ్ అలీ, ఎం సాంబయ్య, ఉప్పల శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *