ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు హుస్సేన్ నాయక్ ని కలిసిన మదర్ ఎన్జీవో మాగంటి
ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు హుస్సేన్ నాయక్ ని కలిసిన మదర్ ఎన్జీవో మాగంటి
బూర్గంపాడు మండలం నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు అధికార పర్యటన సందర్భంగా భద్రాచలం పేపర్ బోర్డు విశ్రాంత మందిరంలో మదర్ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు మాగంటి వెంకటేశ్వరరావు కలిసి గిరిజనులకు సంబంధించిన రెవెన్యూ , అటవీ హక్కుల సమస్యల మీద చర్యల ను గురించి అపరిష్కృత సమస్యల పరిష్కారమునకై వినతి పత్రం అందచేశారు.
పూర్తి సమస్యల పరిష్కారం కోరుతూ ..ఐటీడీఏలో గిరిజన గ్రీవెన్స్ నిర్వహించాలని కోరి ఉన్నారు. అందుకు నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిటీ సభ్యులు హుస్సేన్ నాయక్ గ్రీవెన్స్ డే నిర్వహించడానికి అంగీకారం తెలుపగా వారిని మదర్ ఎన్జీవో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో, ఆర్డీవో, ఐటీసీ అధికారి చెంగల్ రావు, యూనియన్ నాయకులు, నేషనల్ కమిటీ సభ్యులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి బిజెపి నాయకులు ఏ ఏనుగులవెంకటరెడ్డి సీతారాం నాయక్ బాలు నాయక్ వెంకట్ నాయకులు మరియు బూర్గంపహాడ్ ప్రెస్ క్లబ్ మీడియా వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు చెన్నం హనుమంతరావు, శివ, రాజేష్‌రెడ్డి, ఎస్సీ ఎస్టీ సంఘాల నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.