ఏజెన్సీ సింగరేణి ప్రాంతాలలో ఉద్యోగ ఉపాధి ఆదివాసీలకే ఇవ్వాలి.
ఏజెన్సీ సింగరేణి ప్రాంతాలలో ఉద్యోగ ఉపాధి ఆదివాసీలకే ఇవ్వాలి.
మణుగూరు ఏరియా పీవీ కాలనీ సింగరేణి పాఠశాలలో తాత్కాలిక ఉపాధ్యాయ నియామక నోటిఫికేషన్ లో అర్హుల దగ్గర నుండి దరఖాస్తులు కోరడం జరిగింది.
వాటిలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుందన్నారే తప్ప.! ఖచ్చితంగా అనుభవం ఉన్న అభ్యర్థులు మాత్రమే.. ఈ నోటిఫికేషన్ కు అర్హులు అని ఎక్కడా ప్రస్తావించలేదు.
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అందరికీ డెమో (ఇంటర్వ్యూ) ఉంటుంది.
ఆ డెమో లో మాత్రం అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తాము అని సంబంధిత అధికారులు చెప్పి దరఖాస్తులు తీసుకోవడం జరిగింది.
కానీ అభ్యర్థులకు ఎటువంటి సమాచారం లేకుండా డెమోకు హాజరుకానివ్వకుండానే నోటిఫికేషన్ కు విరుద్ధంగా అప్లికేషన్ లో (ఎక్స్-పీరెన్స్) సర్టిఫికెట్స్ లేవనే సాకుతో రిజెక్ట్ చేశారు.
కనీసం రిజెక్ట్ చేసినటువంటి అభ్యర్థుల నోటీస్ బోర్డు లేకుండా.. సెలక్షన్ అభ్యర్థుల వివరాలు లేకుండా.. పారదర్శకత పాటించడం జరిగింది.