మొరాయిస్తున్న బిఎస్ఎన్ఎల్ సెల్ వన్ సేవలు.
మొరాయిస్తున్న బిఎస్ఎన్ఎల్ సెల్ వన్ సేవలు.
గత కొద్దిరోజులుగా బిఎస్ఎన్ఎల్ సెల్ వన్ సేవలు మురాయిస్తుండటంతో వినియోగదారులు అవస్థలు పడుతున్నారు. ఈ విషయాలపై స్థానిక టెలికం శాఖ అధికారులు వద్ద ఫిర్యాదులు చేసిన స్పందన ఉండటం లేదని వినియోగదారులు వాపోతున్నారు ఎన్నికలకు మునుపు బాగా పని చేసిన బిఎస్ఎన్ఎల్ సేవలు… ఫలితాల అనంతరం బాగా మొరాయిస్తున్నాయని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో కొందరు ఏకంగా బిఎస్ఎన్ఎల్ నుంచి ఇతర సేవలు వైపు దుష్టు పెట్టడం జరుగుతోంది గ్రామాల్లో ఏర్పాటు చేసిన సెల్ వన్ టవర్లు చినుకుపడ్డ…విద్యుత్ సరఫరా ఆగిపోతే… ఆయా పరిసరాల్లో సెల్వం సేవలు దూరమవుతున్నాయి.
ఈ విషయాలపై జిల్లా అధికారులు, తిరుపతి ఎంపీ గురుమూర్తి ఇతర అధికారులు చర్యలు తీసుకుని సెల్ వన్ సేవలు మెరుగుపరచాలని, పరిస్థితి ఇలాగే కొనసాగితే.. బిఎస్ఎన్ఎల్ సేవల మనుగడ ప్రమాదంగా మారిందని వినియోగదారుల వాపోతున్నారు.