ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నిక.
ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నిక.
కరకగూడెం, శోధన న్యూస్ :మండల కేంద్రంలోని భట్టుపల్లి రైతువేదికలో మండల పాత్రికేయుల సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.అధ్యక్ష పదవి సాయికిరణ్ (నవ తెలంగాణ) ఉపాధ్యక్ష పదవి సయ్యద్ అఫ్రోజ్ (జనంసాక్షి) ను ఎన్నుకున్నారు.
గౌరవ అధ్యక్షులుగా సురేష్, బిక్షపతి, ప్రధాన కార్యదర్శిగా ప్రవీణ్, కార్యదర్శులుగా విజయ్, యాకన్నా, సాంబమూర్తి, ఎన్నికయ్యారు. సలహాదరులుగా రవి, రాము, సురేందర్, సాయి కుమార్, రామక్రిష్ణ, రమేష్, సునీల్ ఎన్నుకున్నారు. అనంతర నూతన అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ అందరము సమిష్టిగా కలిసి మేలిసి పనిచేసి కరకగూడెం నూతన ప్రెస్ క్లబ్ ను ఆదర్శవంతగా తీర్చిదిద్ధుతమని తమ వంతు కృషి చేస్తామని తెలిపారు.నూతనంగా ఎన్నికైన పదాధికారులను సభ్యులు శాలువాతో సన్మానించి ..శుభాకాంక్షలు తెలిపారు.