మహిళలను ఆర్ధికంగా బలోపేతం చేయాలి .
మహిళలను ఆర్ధికంగా బలోపేతం చేయాలి.
జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా శక్తి పథకంపై అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ పాల్గొన్నారు. ఈ అవగాహన సదస్సులో అన్ని మండలాల ఎంపీడీవోలు, ఎపీఎంలు, మరియు మహిళా సంఘసభ్యులు, కమ్యూనిటీ కోఆర్డినేటర్ సభ్యులు మరియు ఆఫీస్ బేరర్ లకు మహిళా శక్తి పథకం పై అవగాహన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.మహిళలకు జీవనోపాధి కల్పించాలని, వారిని ఆర్థికంగా కోటీశ్వరులని చెయ్యాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ మహిళా శక్తి పథకాన్ని ప్రారంభించిందని తెలిపారు. ఈ పథకాన్ని జిల్లాల్లో విజయవంతంగా అమలుపరచాలని తెలిపారు.
స్వయం సహకారక సంఘాల ద్వారా పలు రకాల పరిశ్రమలను ఏర్పాటు చేసి మహిళలు అభ్యున్నతికి ఈ పథకం తోడ్పడుతుందని ఆయన తెలిపారు. మహిళా సంఘాలు వారు ఏర్పాటు చేసే ప్రతి పరిశ్రమ పైన అవగాహన మరియు ధైర్యం ఉంటేనే వారు విజయం సాధిస్తారని తెలిపారు.
మహిళా సంఘాలు ఏర్పాటు చేసే చిన్న పరిశ్రమలు వాటి ద్వారా తయారయ్యే వస్తువుల మార్కెట్ మరియు ప్రజల అవసరమైన వస్తువులు చేయడం ద్వారా విజయం సాధించవచ్చని సూచించారు. సంఘాలు స్థాపించే చిన్న పరిశ్రమలు పూర్తి నాణ్యత పాటిస్తూ, ఆకర్షణీయమైన ముద్ర రూపొందించుకోవాలని సూచించారు.
మహిళా సంఘాలు చిన్న పరిశ్రమలైన పెరటి కోళ్ల పెంపకం, తేనెటీగల పెంపకం, ఆ జోల పెంపకం, చేపల పెంపకం, పాడి పరిశ్రమ, కుట్టు మిషన్ కేంద్రాలు, మీసేవ కేంద్రాలు, ఆహార పదార్థాల తయారీ కేంద్రాలు మరియు డబ్బా వాలా కేంద్రాలు తదితర చిన్న పరిశ్రమలు స్థాపించడం ద్వారా మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధించవచ్చని తెలిపారు.