తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే  కఠిన చర్యలు తీసుకుంటాం

లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే  కఠిన చర్యలు తీసుకుంటాం

-భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్య శాఖ అధికారి భాస్కర్ నాయక్

భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్ :  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎల్  భాస్కర్ నాయక్ ఆధ్వర్యంలో, గర్భస్థ లింగ నిర్ధారణ చట్టం 1994 ఆక్ట్ పీసీ అండ్  పి ఎన్ డి టి సంబంధించి అడ్వైజరీ కమిటీ మీటింగ్ నిర్వహించారు.  ఈ మీటింగ్ లో కమిటీ వారు కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఎవరైనా లింగ నిర్ధారణ చట్టం ను అతిక్రమించి లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి తెలిపారు.  అదేవిధంగా సరైన కారణం లేకుండా అబార్షన్ నిర్వహిస్తే వారిపై కూడా కఠిన చర్యలు తప్పవని, కమిటీ నిర్ణయించింది.  ఎవరికైనా పర్మిషన్ ఇస్తే అన్ని రకాల ధ్రువపత్రాలు సమర్పిస్తేనే వారికి పర్మిషన్ ఇవ్వాలని నిర్ణయించారు .దీనిపై ప్రజలకు అవగాహన కల్పించుట కొరకు ఐయి సి మెటీరియల్ ప్రింట్ చేసి పంపిణీ చేయాలని కోరారు, ఈ కార్యక్రమంలో పి ఓ ఎం సి హెచ్ డాక్టర్ చైతన్య , డాక్టర్. అనూష, పార్వతి అడ్వకేట్ ,డాక్టర్ కోరా శ్రీ యాదవ్,ఎండి అజ్గర్ హుస్సేన్ డిపిఆర్ఓ,ఎండి, ఫైయాస్ మోహిద్దీన్ డిప్యూటీ, డెమో, పి శ్రీనివాసరావు డిపి ఎం  ఓ,టి విజయ్ కుమార్ హెచ్ ఈపి బేబీ హెచ్ఈ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *