ఐటీడీఏ పిఓ ను మర్యాదపూర్వకంగా కలిసిన సిపిఐ నాయకులు
ఐటీడీఏ పిఓ ను మర్యాదపూర్వకంగా కలిసిన సిపిఐ నాయకులు
-పోడు సాగుదారులకు పట్టాలు ఇప్పించే విధంగా కృషి చేయాలి
-జిల్లా వ్యాప్తంగా గిరిజనుల సమస్యలను పరిష్కరించాలి
-గిరిజన గూడాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టాలి
– సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా
భద్రాద్రి కొత్తగూడెం/భద్రాచలం, శోధన న్యూస్ : పోడు సాగుదారులు అందరికి పట్టాలి ఇప్పించే విధంగా జిల్లా వ్యాప్తంగా గిరిజన సమస్యలు పరిష్కరించే విధంగా గిరిజన గుడాల్లో మౌలిక సదుపాయాలు కల్పనకు కృషి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా ఐ టి డి ఏ పీవో బి రాహుల్ ను కోరారు. మంగళవారం భద్రాచలంలోని ఐటీడీఏ కార్యాలయంలో పిఓ బి రాహుల్ ను సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు ముత్యాల విశ్వనాథం, సిపిఐ జిల్లా సమితి సభ్యులు వీసంశెట్టి పూర్ణచంద్రరావు, దుగ్గిరాల సుధాకర్, రైతు సంఘం జిల్లా నాయకులు శనగారపు శ్రీనివాసరావు, మాజీ ఎంపిటిసి దారా శ్రీనివాసరావు, కుంజ రాందాస్ వజ్జా నారాయణ తో కలి మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం జిల్లా వ్యాప్తంగా గిరిజనుల సమస్యలను పరిష్కరించాలని, గిరిజన గూడాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టాలని వారు పిఓని కోరారు.