ఐటిఐ లో రెండవ విడత ప్రవేశాలకు దరఖాస్తుల గడువు పొడిగింపు
ఐటిఐ లో రెండవ విడత ప్రవేశాలకు దరఖాస్తుల గడువు పొడిగింపు
మణుగూరు, శోధన న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేటు ఐటీలలో రెండో విడత ప్రవేశాల కోసం ఈనెల 4నుంచి 15 వరకు దరఖాస్తులు చేసుకోవాల ఇచ్చిన గడువు ఈ నెల 20 వరకు పొడిగించినట్లు జిల్లా కన్వీనర్ మణుగూరు ప్రభుత్వ ఐటిఐ ప్రిన్సిపాల్ బడుగు ప్రభాకర్ మంగళవారం తెలిపారు. మణుగూరు ప్రభుత్వ ఐటిఐ లోని ఎలక్ట్రిషన్, ఫిట్టర్, డ్రాఫ్ట్ మెన్ సివిల్, డీజిల్ మెకానిక్ ,కంప్యూటర్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ (కోప ) కోర్సు లలో సీట్లు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. అర్హత ఆసక్తి కలిగిన విద్యార్థులు ఈనెల 20లోగా సమీపంలోని ప్రభుత్వ ఐటిఐ లో దరఖాస్తులు ఆన్లైన్ చేసుకోవడానికి ప్రత్యేక సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. www. ititelangana. gov.in అనే వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవచ్చున్నారు.. ఇటీవల సప్లమెంటరీలో పదవ తరగతి పాస్ అయిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. మొదటి విడత దరఖాస్తు చేసుకొని సీటు రానివారు ఆప్షన్ పెట్టుకోవాలి అని తెలిపారు. పూర్తి వివరాల కోసం 9440206990కు ఫోన్ చేసి తెలుసుకోవాలన్నారు.