లక్మిపురం రోడ్డును బాగు చేసిన ఎంపీడీవో
లక్మిపురం రోడ్డును బాగు చేసిన ఎంపీడీవో
- ‘శోధన న్యూస్ ఎఫెక్ట్ ‘
కరకగూడెం, శోధన న్యూస్: కరకగూడెం మండలం బట్టుపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని లక్ష్మీపురం గ్రామంలో ప్రధాన రహదారి చినుకు పడితే చిత్తడే, లక్ష్మీపురం రోడ్డును బాగు చేసే వారెవ్వరు అనే శీర్షిక ప్రచురించడంతో స్పందించిన ఎంపీడీవో దేవ వర కుమార్, కార్యదర్శి శ్రీజ, స్పెషల్ ఆఫీసర్ మోహన్ బాబు, బుధవారం గ్రావెల్ పోసి ప్రజలకు రోడ్డును అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఎంపీడీవో దేవ వర కుమార్, స్పెషల్ ఆఫీసర్ మోహన్ బాబు, కార్యదర్శి శ్రీజ మాట్లాడుతూ. సమస్యను తమ దృష్టికి తీసుకొచ్చిన శోధన న్యూస్ సోదరుడికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని వారన్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగు ఏర్పాట్లు చేయడమే తమ బాధ్యత అని వారన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల గ్రామపంచాయతీ లోని అన్ని గ్రామాలలో ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నామని బ్లీచింగ్ క్లోరినేషన్ పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తున్నామని వారు తెలిపారు. ప్రజల దృష్టికి తీసుకువెళ్లి తమ సమస్యను పరిష్కరించిన శోధన న్యూస్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని గ్రామస్తులు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ మోహన్ బాబు, కార్యదర్శి శ్రీజ, కారోబార్ ఉప్పలి సాంబశివరావు, తదితరులు పాల్గొన్నారు.