వైద్య కళాశాలలో పోస్టులు
వైద్య కళాశాలలో పోస్టులు
వైద్య కళాశాలలో నోటిఫికేషన్ ఇవ్వబడిన 155 పోస్టులకు సంబంధించి దరఖాస్తు చఏకదంతం అభ్యర్థుల లిస్ట్ ను ప్రాథమికం గా ఆన్లైన్ చేసి జిల్లా అధికారిక వెబ్సైట్ http://kothagudem.telangana.gov.in లో పొందుపరిచినట్లుగా జిల్లా ఉపాధి కల్పన అధికారిని వేల్పుల విజేత ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అట్టి లిస్టును చూసుకొని వారి అర్హత మరియు మార్కుల విషయంలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే (15) రోజుల్లోగా అనగా 05.08.2024 లోగా వారి యొక్క అభ్యంతరాలను జిల్లా ఉపాధి కల్పనా అధికారి వారి కార్యాలయంలో లిఖితపూర్వకంగా తగిన ఆధారాలతో అభ్యంతరాలు తెలుపగలరని అన్నారు.సంబంధిత రంగం లోని క్వాలిఫికేషన్ , అనుభవం తదితర పత్రాలను ఒకసారి సరిచూసుకుని (15) రోజుల లోగా అన్ని అభ్యంతరాలను నివృత్తి చేసి .. సర్టిఫికెట్లు వెరిఫై చేసిన పిదప ఫైనల్ మెరిట్ లిస్టును తయారు చేస్తామని జిల్లా ఉపాధి కల్పనా అధికారిని వేల్పుల విజేత ఒక ప్రకటనలో తెలిపారు .