ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల ప్రమాదాలు
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల ప్రమాదాలు
* వర్షానికి తడిసిన విద్యుత్ స్తంభాలను, గోడలను తాకరాదు. వాటికి కరెంట్ షాక్ వచ్చి ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది.
* ఇసుప జే వైర్ లపై గృహిణులు బట్టలు ఆరవేయరాదు, ఇనుప వైర్లకు కరెంట్ షాక్ వచ్చే ప్రమాదం ఉంది.
* శిథిలావస్థలో ఉన్న ఇళ్ళలో, మట్టి గోడలతో ఉన్న ఇళ్ళలో నివాసం ఉండకండి. అవి ఊహించని విధంగా కూలిపోయి ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉంది.
* వర్షాకాలంలో మీ ఇంటి ఆవరణలో నీరు నిల్వ లేకుండా చూసుకోండి. నిరుపయోగంగా పడవేసిన పాత కూలర్లలో, పాత్రలలో, ప్లాస్టిక్ డబ్బాలలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోండి. వీటి వలన దోమలు వ్యాప్తి చెంది విష జ్వరాలు వస్తాయి.
* మీయొక్క వాటర్ డ్రమ్ములలో, వాటర్ ట్యాంకులలో నీరు ఎక్కువ రోజులు నిల్వ ఉంచకుండా తరచూ శుభ్రం చేసుకోండి.
* గొర్రెల మరియు పశువుల కాపరులు వరద ఉధృతంగా ఉన్నప్పుడు నదులు, వాగులు దాటే ప్రయత్నం చేయకండి. పశువులు వరదలో చిక్కుకుని కొట్టుకుపోయే అవకాశం ఉంది.
* పిడుగులు పడుతున్నప్పుడు, గాలి దుమారం వీస్తున్నప్పుడు ప్రజలు మరియు రైతులు ఎట్టి పరిస్థితుల్లో చెట్ల కింద ఉండరాదు.
* రైతులు వ్యవసాయ బావులు, బోర్ల వద్ద తడిసిన స్టార్టర్ బాక్సులను, ఫ్యూజులను చేతులతో ముట్టుకోరాదు.
* చిన్న పిల్లలు మరియు ఈత రానివారు ఎట్టిపరిస్థితుల్లో చెరువులలో, నదులలో ఈతకి కానీ, చేపల వేటకు కానీ వెళ్ళరాదు.