ఖమ్మంతెలంగాణ

చెక్ పోస్టులు, బెల్ట్ షాపులను తనిఖీ చేయాలి

చెక్ పోస్టులు, బెల్ట్ షాపులను తనిఖీ చేయాలి

-జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్

ఖమ్మం, శోధన న్యూస్ :
చెక్ పోస్ట్ ల వద్ద పకడ్బందీగా తనిఖీలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ అన్నారు. కలెక్టర్ ఆదివారం రాత్రి సుబ్లేడు క్రాస్ రోడ్ వద్ద ఏర్పాటు చేసిన అంతర్ జిల్లా చెక్ పోస్టు ఆకస్మిక తనిఖీ చేశారు. ఎంత మంది విధులు నిర్వర్తిస్తున్నారో, ఎన్ని  వాహనాలు తనిఖీ చేశారో  అడిగి తెలుసుకున్నారు. గూడ్స్ వాహనాలను తనిఖీ చేయాలని ఆయన తెలిపారు. నగదు, మద్యం రవాణా నియంత్రించాలన్నారు. వాహనాల తనిఖీ సంబంధించి రిజిస్టర్ ను నిర్వహించాలన్నారు. ప్రతి చెక్ పోస్ట్ లో వీడియోగ్రఫీ కి చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. 24 గంటల పటిష్ట నిఘా పెట్టాలని ఆయన అన్నారు.బెల్ట్ షాప్ ను తనిఖీ చేసి, సీజ్ చేయాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్ చెక్ పోస్ట్ తనిఖీ అనంతరం కలెక్టర్ ప్రక్కనే ఉన్న బానోత్ మంగీలాల్ షాపుని తనిఖీ చేశారు. బెల్ట్ షాప్ నిర్వహిస్తున్నట్లు గమనించి షాపులో తనిఖీలు చేయగా, అమ్మకానికి ఉంచిన మద్యం సీసాలు కలెక్టర్ గుర్తించారు. షాపు సీజుకు అధికారులను ఆదేశించారు. బెల్ట్ షాపులపై ఉక్కుపాదం మోపాలని, అక్రమ మద్యం అమ్మకాలను అరికట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. బెల్ట్ షాపులకు మద్యం సరఫరా చేసే మద్యం షాపులపై చర్యలు చేపట్టాలన్నారు.ఈ తనిఖిలో పాలేరు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిణి, ఎస్డీసి రాజేశ్వరి, సిఐ జితేందర్ రెడ్డి, ఖమ్మం రూరల్ తహసీల్దార్ పివి రామకృష్ణ, ఎన్నికల డిటి రవీందర్, ఆర్ఐ వీరయ్య, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *