రైతు బరోసా డబ్బులను …రైతు ఋణమాఫీ కి ఇచ్చి రైతులను మభ్యపెడుతున్న కాంగ్రెస్
రైతు బరోసా డబ్బులను …రైతు ఋణమాఫీ కి ఇచ్చి రైతులను మభ్యపెడుతున్న కాంగ్రెస్
-మహబూబాబాద్ జిల్లా మహిళ మోర్చ అధ్యక్షురాలు గుండెబోయిన నాగమణి
మహబూబాబాద్, శోధన న్యూస్ : రైతు బంధు అనేది రైతులకు వ్యవసాయ సాగుకు ప్రారంభంలో జూన్ – జులై నెలలో చెల్లించాలని, కాని కమీటిల పేరుతో కాలయాపన చేస్తు నేటికి చెల్లించ లేదని మహబూబాబాద్ జిల్లా మహిళ మోర్చ అధ్యక్షురాలు గుండెబోయిన నాగమణి అన్నారు. రైతు బంధు కు చెల్లించ వలసిన 7వేల 500 కోట్లను ..రైతు బంధు కు ఇవ్వకుండా అవే డబ్బులను రైతు ఋణమాఫీ చేసి రైతు బంధు ను కాలయాపాన చేస్తు ..రైతులను కాంగ్రెస్ మోసం చేస్తోందన్నారు. ప్రస్తుతం ఈ టైం లో రైతు ఋణమాఫీ వల్లన రైతులకు వ్యవసాయం చేయుటకు ఏలాంటి ప్రయోజనం లేదని, ఎందుకంటే రైతు ఋణమాఫీ చేస్తే రైతుకు ఒక్క పైస కూడా రైతు చేతికి రాదని అన్నారు.అది రైతు అప్పు కింద ,అప్పు ఇచ్చిన బ్యాంకులు తీసుకుంటాయని, రైతులు వ్యవసాయం చేయాలి అంటే ప్రస్తుతం ఇప్పుడు పెట్టుబడి కావాలి .పెట్టుబడి కావాలి అంటే మళ్ళి అప్పులు చేయాలన్నారు. అదే ముందుగా రైతు బంధు 7 వేల 500కోట్లను రైతులకు…. రైతు బంధుగా ఇచ్చి ఉంటే రైతుకు పెట్టుబడిగా ఉపయోగపడేవి ..రైతులు అప్పులు చేయవలసిన అవసరం ఉండేది కాదన్నారు. ఈ విధానం వల్లన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేయడమే అవుతుందన్నారు . ఒక వేల కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ఋణమాఫీ తో పాటు వెంటనే రైతు బంధు ఇచ్చి ఉంటే రైతులకు మేలు జరిగేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతు ఋణమాఫీ తో పాటు వెంటనే రైతు బంధు ఇచ్చి రైతులను అప్పుల ఊబిలో చేరకుండా చూడాలన్నారు.