సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం
సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం
పినపాక నియోజకవర్గం, శోధన న్యూస్ : తెలంగాణ రాష్ట్ర రైతులకు రుణమాఫి చేసిన సందర్బంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండల కేంద్రంలోనిరైతు వేదిక లో ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ, తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి చిత్రపటాలకు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు రైతులతో కలిసి పాలాభిషేకం చేశారు. అనంతరం రైతు వేదికలో రైతులు,నాయకులు, అధికారులతో వీడియో కన్ఫరెన్స్ ద్వారా భేటీ అయి సిఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. అనంతరం ఎమ్మెల్యే పాయం మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల సంక్షేమనికి కృషి చేస్తుందని, గత ఎన్నికలలో ఇచ్చిన హామీల అమలుకు కట్టుబడి రెండు లక్షల రైతు రుణమాపీని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర రైతులకు రుణమాపీ చేస్తానని చెప్పి మాట తప్పని మడమ తిప్పని ప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీ రెండు లక్షలు రుణమాపీ చేసిన సందర్బంగా పినపాక నియోజకవర్గం రైతుల పక్షాన సిఎం రేవంత్ రెడ్డి కి ఆయన ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు సోదరులు,ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.