రాజకీయాల నుండి వనమా కుటుంబం ఎన్నటికీ దూరం కాదు
రాజకీయాల నుండి వనమా కుటుంబం ఎన్నటికీ దూరం కాదు : వనమా రాఘవ
భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్ : కొత్తగూడెం నియోజకవర్గ రాజకీయాల నుండి వనమా కుటుంబం ఎన్నటికీ దూరం కాదని వనమా రాఘవ తెలిపారు. కొత్తగూడెం టిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో అభిమానులు ముఖ్య నాయకులతో ఆయన సమావేశమై మాట్లాడారు. ఎన్ని ప్రతిఘటనలు ఎదురైనా, ఎన్ని అవాంతరాలు ఎదురైనా రాజకీయాలనుండి తప్పుకునే ప్రసక్తే లేదన్నారు. వనమా కుటుంబం నమ్ముకుని 40 సంవత్సరాల నుండి మాతో ఉంటున్న అభిమానులు, కార్యకర్తలకు చివరిదాకా పనిచేస్తాం అన్నారు. కెసిఆర్, కేటీఆర్లే మన నాయకులని తెలిపారు. 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర గల కుటుంబం వనమా కుటుంబం అని అన్నారు. కొత్తగూడెం నియోజకవర్గం వనమా కుటుంబానికి తల్లి లాంటిదన్నారు. వనమా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంజూరు చేయించిన విధులతోనే కొత్తగూడెం నియోజకవర్గం లో అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడు జరుగుతున్నాయన్నారు. కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీలకు ఒకేసారి 225 కోట్లు మంజూరు చేయించిన ఘనత వనమాకే దక్కుతుందన్నారు.