సమత జడ్జి మెంట్ ప్రకారమే నియామకాలు జరగాలి
సమత జడ్జి మెంట్ ప్రకారమే నియామకాలు జరగాలి.
మణుగూరు సింగరేణి స్కూల్లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగ నియామకాలు సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం గా స్థానిక ఆదివాసీలకు, ల్యాండ్ లూజర్స్ కి మాత్రమే ఇవ్వాలని ఆదేశాలు ఉన్నాయి. సమత జడ్జిమెంట్ (1997) చట్ట ప్రకారం అమలు చేస్తూ ఆదివాసీలకు, ల్యాండ్ లోజర్ లకు మాత్రమే అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు, పర్మినెంట్ ఉద్యోగాలు ఇవ్వాలని చట్టం చెబుతున్న స్థానిక సింగరేణి అధికారులు మాత్రం ఏ చట్టాలను పట్టించుకోకుండా.. వారికి నచ్చినట్లుగా ఉద్యోగాలను అమ్ముకుంటున్నారని, గతంలో (12-07-2024) న డెమో ఇంటర్వ్యూలో కేవలం దొడ్డిదారిన సెటిల్మెంట్ చేసుకున్న అభ్యర్థులకు మాత్రమే డెమో నిర్వహించడం జరిగిందన్నారు.సమత జడ్జిమెంట్ ప్రకారం నిర్వహించాలని, ఏజెన్సీ చట్టాలకు అనర్హులైనటువంటి గిరిజననేతరుల దరఖాస్తులు స్వీకరించకూడదని మణుగూరు ఆదివాసీ జేఏసీ తరపున సింగరేణి ఎస్.ఓ. టు జి. ఎం. కు దరఖాస్తు ఇవ్వడంమైనది. చట్ట ప్రకారం అమలు చేయని పక్షాన సంబంధిత సింగరేణి అధికారులపై కోర్టు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.