Police :సెల్ఫీల కోసం వెళ్లి ప్రమాదాలకు గురికావద్దు.
సెల్ఫీల కోసం వెళ్లి ప్రమాదాలకు గురికావద్దు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షాల కారణంగా వాగులు,వంకలు,నదుల వద్ద ప్రవాహం అధికంగా ఉందన్నారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఒక ప్రకటనను విడుదల చేశారు.
జలాశయాలు,చెరువులు,వాగుల వద్దకు సెల్ఫీలు దిగడానికి, చేపలు పట్టడానికి ఎవరు వెళ్ళకూడదన్నారు .వరద నీటితో ప్రమాదకరంగా మారిన రోడ్లను దాటడానికి ప్రయత్నించి ప్రమాదాల బారిన పడవద్దు అని సూచించారు.సరదాల కోసం పిల్లలు,యువకులు ఫోటోల కోసం,ఈతలు కొట్టడానికి వెళ్ళకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
విపత్కర సమయాల్లో డయల్ 100కు ఫోన్ చేసి తక్షణమే పోలీసువారి సహాయం పొందాలని తెలిపారు.ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా భద్రాచలం వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుందని,లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.పోలీసు వారు చేపట్టే చర్యలకు జిల్లా ప్రజలందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.