BadradrikothagudemManuguru

భాదితులుకు 25 కేజీల బియ్యాన్ని అందజేత 

భాదితులుకు 25 కేజీల బియ్యాన్ని అందజేత 

మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని రాజుపేట లో భారీ వర్షానికి రేకులుఇంటి గోడలు కూలిన భాదితులుకు 25 కేజీల బియ్యాన్ని అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు.

తెలంగాణ రాష్ట్ర లోని భద్రాద్రి కోత్తగూడేం జిల్లా లో గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని రాజుపేట లో రేకులు ఇల్లు గోడలు కూలి గంట రాములమ్మ అనే మహిళ కుటుంబ సభ్యులు నిరాశ్రయులయ్యారు.కూలీ పని చేసుకుంటూ కుంటుంబాన్ని పోషించు కుంటూ రేకుల షెడ్డులో నివసిస్తోంది.భారీ వర్షం ఆమె పాలిట శాపం అయింది. వర్షానికి నాని ఆకస్మికంగా రేకులు ఇల్లు గోడలు కూలిపోయింది.

మేషన్ పనులు లేక కుటుంబం మొత్తం పస్తులు ఉంటుంది అనే విషయం తెలుసుకున్న సామాజిక కార్యకర్త లాయర్ కర్నె రవి పినపాక నియోజకవర్గ యువజన నాయకుడు మట్టపల్లి సాగర్ యాదవ్ కలిసి 25 కేజీల బియ్యాన్ని నిరాశ్రయులైన గంట రాములమ్మ కి బియ్యాన్ని అందజేసి తమ ఔదార్యాన్ని చాటుకుంటున్నారు సామాజిక కార్యకర్త లాయర్ కర్నె రవి మాట్లాడుతూ భారీ వర్షాలకు రేకులు ఇల్లు గోడలు కూలీ నిరాశ్రయులైన గంట రాములమ్మ కుటుంబానికి భద్రాద్రి కోత్తగూడేం జిల్లా కలెక్టర్ గారు తక్షణమే విపత్తు నిధులు నుంచి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *