మణుగూరు సింగరేణి ఆసుపత్రి లో ఒకేరోజు 12 కాన్పులు
మణుగూరు సింగరేణి ఆసుపత్రి లో ఒకేరోజు 12 కాన్పులు
-వైద్యులను అభినందించిన కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎమ్మెల్యే పాయం, డిసిహెచ్ఎస్ రవిబాబు
మణుగూరు, శోధన న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఏరియా సింగరేణి ఆసుపత్రి చరిత్రలో మొదటిసారిగా ఒకేరోజు 12 కాన్పులు నిర్వహించారు. అందులో 07 ఆపరేషన్స్ చేయగా 05 సాధారణ కాన్పులు చేశారు.. 12 మంది పిల్లలలో 08 మంది మగ , 04 ఆడ శిశువులు జన్మించారు. తల్లి బిడ్డలు అందరు క్షేమంగా ఉన్నారు. వీరందరూ మణుగూరు చుట్టుప్రక్కల ప్రాంతాలైన శివలింగాపురం, పినపాక, కరకగూడెం, అశ్వాపురం, పాల్వంచ, జానంపేట నుండి ఇక్కడకి కాన్పూ కోసం రావడం జరిగింది. ఆసుపత్రి లో కేవలం ఒక గైనకాలజిస్ట్, ఒక అనస్టటిస్ట్ మాత్రమే ఉన్నారు. వారి పర్యవేక్షణలో కాన్పులు జరిగాయి. ఈ కాన్పులు చేసిన వారిలో డాక్టర్ భవాని,డాక్టర్ కృష్ణ ప్రసాద్, నర్సింగ్ ఆఫీసర్ కవిత, లలిత భాయ్, ఓటీ నర్సింగ్ ఆఫీసర్ బేబీ రాణి, కల్పన, లాల్ ఖాన్ లను జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్, పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు, డిసిహెచ్ఎస్ రవిబాబు అభినందించారు. ఇలాగే భవిష్యత్తులో మంచి సేవలు అందించి ఆసుపత్రికి మంచి పేరు తీసుకురావాలని వారు సూచించారు. ఇప్పటి వరకు ఏరియా ఆసుపత్రిలో 519 ఆపరేషన్ ద్వారా,697 సాధారణ కాన్పులు మొత్తం 1215 కాన్పులు జరిగాయని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సునీల్ మజ్నేకర్ తెలిపారు.