BadradrikothagudemTelangana

ఇంటింటా ఇన్నోవేటర్ కు ఆవిష్కకర్తల దరఖాస్తులు ఆహ్వానం.

ఇంటింటా ఇన్నోవేటర్ కు ఆవిష్కకర్తల దరఖాస్తులు ఆహ్వానం.

ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమంలో భాగంగా వాక్ ఫర్ ఇన్నోవేషన్ ఆవిష్కకర్తల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జితేష్ తెలిపారు. ఆగస్టు 3 వ తేదీ వరకు ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమంలో పాల్గొనేవారు తమ వివరాలు పంపాలని ఆయన తెలిపారు.

ఇంటింటా ఇన్నోవేటర్ కు గ్రామీణ, పట్టణ ప్రాంతాల ఔత్సాహికులు ఆవిష్కరణలలో తమ ప్రతిభను చాటుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇంటింటా ఇన్నోవేషన్ కార్యక్రమం చక్కని వేదికగా నిలుస్తుందని ఆయన అన్నారు.ప్రజల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడానికి జిల్లాలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఆవిష్కరణల ప్రదర్శనను నిర్వహించినున్నట్లు చెప్పారు. ఈ ప్రదర్శన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఉంటుందని తెలిపారు.ఈ ప్రదర్శనలో పాల్గొనడానికి అన్ని రంగాల, వర్గాల ప్రజల నుండి ఆవిష్కరణలను కోరడం జరుగుతుందని చెప్పారు. గ్రామీణ, విద్యార్థుల, వ్యవసాయ, సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమ ఆవిష్కరణలు మొదలగు వాటి ఆవిష్కరణలు పంపాలని కలెక్టర్ తెలిపారు.

ఆవిష్కర్తలు తమ ఆవిష్కరణకు సంబంధించి 6 వాక్యాలు, 2 నిమిషాల వీడియోను, ఆవిష్కరణ యొక్క 4 ఫోటోలు, ఆవిష్కర్త పేరు, ఫోన్ నెంబర్, వయసు, ప్రస్తుత వృత్తి, గ్రామం, జిల్లా పేరు తదితర వివరాలను తెలియచేస్తూ 9100678543 సెల్ నంబర్ కు వాట్సాప్ చేయాలని చెప్పారు.

ఇన్నోవేటర్స్ నుండి దరఖాస్తులను స్వీకరించడానికి చివరి తేదీ ఆగస్ట్ 3 అని, వచ్చిన దరఖాస్తుల నుండి ఎంపిక చేసిన ఆవిష్కరణలు ఆగస్టు 15న ప్రదర్శనకు ఎంపిక చేయనున్నట్లు  తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *