BadradrikothagudemManuguru

 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులను వెంటనే విడుదల చేయాలి.

 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులను వెంటనే విడుదల చేయాలి.

గ్రామ పంచాయతీల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులను వెంటనే విడుదల చేయాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్( ప్రజాపంద) మణుగూరు డివిజన్ కార్యదర్శి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్. మధుసూదన్ రెడ్డి కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.  గ్రామపంచాయతీలను సందర్శించి, పంచాయతీల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక గ్రామ పంచాయతీలలో నిధులు లేకపోవడం వలన ట్రాక్టర్ల కిస్తీలు కూడా కట్టలేని పరిస్థితి, డీజిల్ కూడా పోయలేని పరిస్థితి, ట్రాక్టర్ల రిపేరు కూడా చేయించలేని పరిస్థితి, మల్టీ పర్పస్ వర్కర్స్ కు, స్కావెంజర్స్ కు నెలల తరబడి జీతాలు చెల్లించలేని పరిస్థితి, బ్లీచింగ్ పౌడర్ కూడా కొనలేని పరిస్థితి, ఇంకా ఇతర ఏ చిన్న చిన్న పనులు కూడా చేయించలేని దుర్భర పరిస్థితులు ఏర్పడ్డాయి అన్నారు.

దేశానికి పల్లెలే పట్టుకొమ్మలు అని నీతులు చెప్పే పాలకులు గ్రామ పంచాయతీలకు నెలలు, సంవత్సరాల తరబడి నిధులు విడుదల చేయకపోతే గ్రామాలు ఎలా అభివృద్ధి చెందుతాయని ప్రశ్నించారు. ఇది వర్షాకాలం సీజన్ కావడం వలన గ్రామాల రహదారుల వెంట సైడ్ కాల్వలు తీయుట, బ్లీచింగ్ చల్లుట, చెత్త చెదారం లేకుండా శుభ్రం చేయుట తదితర అత్యవసర పనులు చేయించవలసిన పరిస్థితి ఉంటుంది అన్నారు.

ఇలాంటి అత్యవసర పనులు చేయించకపోతే దోమలు వ్యాప్తి చెంది గ్రామాల్లో ప్రజలు రోగాల బారిన బడే ప్రమాదం ఉంటుంది అన్నారు. ప్రభుత్వాలు నిధులు విడుదల చేయకపోతే ఈ పనులు ఎలా జరుగుతాయని ప్రశ్నించారు. గ్రామ పంచాయతీల అభివృద్ధి పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా గ్రామ పంచాయతీలకు నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీల అభివృద్ధి పట్ల నిర్లక్ష్యం ప్రదర్శిస్తే రానున్న రోజుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *