Meals: విద్యార్థినులకు సహ పంక్తి భోజనాలు
విద్యార్థినులకు సహ పంక్తి భోజనాలు
సింగరేణి కార్మికులు మణుగూరు ఏరియా ఏఐటీయూసీ నాయకులు ఓసి 4 లో ఆపరేటర్ గా పని చేస్తున్న నంబూరి శ్రీనివాస్ సతీమణి అనురాధ ఏడవ వర్ధంతిని పురస్కరించుకొని మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని శివలింగాపురం బాలల సదనం విద్యార్ధినులకు సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేశారు.
కూనవరం గ్రామానికి చెందిన లేటు వల్లభనేని మహేష్ సతీమణి ప్రసన్న కు ఐదువేల రూపాయల ఐదువేల రూపాయల విలువ గల నిత్యవసర వస్తువులను అందజేశారు, ఈ సందర్భంగా నంబూరి శ్రీనివాస్ మాట్లాడుతూ తన జీవిత భాగస్వామి అనురాధ లేని లోటు తీర్చలేనిదని ఆమె జ్ఞాపకార్థం తన ఇరువురు కుమార్తెలు తేజశ్రీ, ఉషశ్రీ ల సహకారంతో ప్రతి సంవత్సరం అనాధ పిల్లలకు, వృద్ధులకు, నిరుపేద ఆదివాసీలకు స్వచ్ఛంద సంస్థలకు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తనకు అన్ని విధాలుగా సహకరిస్తున్న సింగరేణి సేవా సమితి సభ్యులకు మిత్రులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సింగరేణి సేవా సమితి సభ్యులు యస్ డి నా సర్ పాషా, శేఖర్ రెడ్డి, నాగళ్ళ నాగమల్లేశ్వరరావు, మణుగూరు ఏరియా కమ్మ మహాజన సంఘం అధ్యక్షులు వీరపనేని చెన్నకేశవులు, పుచ్చకాయల శంకర్, దారపునేని హరికృష్ణ, బండి వేణుగోపాల్,బాలల సదనం సిడిపిఓ పి విజయలక్ష్మి, వార్డెన్ దీప్తి రాణి, సిబ్బంది ఆర్ పద్మ, విజయలక్ష్మి, దేవరకొండ కుమారి, రమణమూర్తి,మణి విద్యార్ధినులు కుసుమ, ఇందు ,రమ్య తదితరులు పాల్గొన్నారు.