కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలు అంటే ఎందుకు ఇంత కక్ష.
కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలు అంటే ఎందుకు ఇంత కక్ష.
కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి మరొకసారి మొండి చేయి చూపారని కాంగ్రెస్ పార్టీ కరకగూడెం మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ఆయన మాట్లాడుతూ బడ్జెట్లో తెలంగాణకు మొండి చేయి చూపారని, మోడీ దేశంలోని అన్ని రాష్ట్రాలకు ప్రధాన మంత్రి ఆ లేక కొన్ని రాష్ట్రాలకేనా అని ప్రశ్నించారు.
గత పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ ప్రజలు తిరస్కరించిన బలహీన ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ తన కుర్చీని కాపాడుకునేందుకు కొన్ని రాష్ట్రాల సీఎంలకు భయపడి ఆ రాష్ట్రాలకు అధిక నిధులు కేటాయిస్తున్నారన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రజలు బిజెపి పార్టీకి 8 ఎంపీ సీట్లు ఇవ్వగా కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం బడ్జెట్లో తెలంగాణ పేరు పలకకపోవడం, చిల్లి గవ్వ కూడా ఇవ్వకపోవడం సిగ్గుచేటు అన్నారు.
గత పార్లమెంట్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తరపున ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా అగ్ర నేత రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి పదేపదే చెప్పిన మాట, మోడీ మన రాష్ట్రానికి గాడిద గుడ్డు ఇచ్చిండు అని అదే మాట నేడు నిజమైందని అన్నారు.